శ్రీకాకుళం

గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 13: పారాలీగల్ వాలంటీర్లు గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు వి.బి నిర్మలాగీతాంబ పారాలీగల్ వలంటీర్లకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా న్యాయస్థానాల ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన నాలుగు రోజుల పారాలీగల్ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పారాలీగల్ వలంటీర్లకు మండల న్యాయ సేవాధికార సంస్థ తరపున గుర్తింపు కార్డులను పంపిణీచేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. పారాలీగల్ వలంటీర్లు గ్రామస్థాయిలో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిపొందని వారికి సరైన అవగాహన కల్పించి మండల లేదా జిల్లా న్యాయసేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అటువంటి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వపరంగా లబ్ధిపొందేవిధంగా తగిన న్యాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా న్యాయపరమైన అంశాలకు సంబంధించి గ్రామస్తులకు సరైన అవగాహన ఉండదని, వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అవసరమైతే ఉచిత న్యాయ సలహాలను పారాలీగల్ వాలంటీర్లు ఇవ్వాలని, అలాగే ఎటువంటి ఖర్చులు లేకుండా కేసును వాదించి సరైన న్యాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ ఇచ్చామని, వలంటీర్లు బాధ్యతతో వ్యవహరించాలని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్‌కుమారి, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.కృష్ణారావు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. జిల్లా కారాగారాన్ని ఆకస్మీక తనిఖీ చేసిన జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి మేరిగ్రేస్‌కుమార్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ మేరిగ్రేస్‌కుమార్ శుక్రవారం ఉదయం జిల్లా కారాగారాన్ని ఆకస్మీక తనిఖీ చేసారు. కారాగారంలోని వంటగది, క్యాంటిన్, గ్రంధాలయం సందర్శించి పర్యవేక్షించారు. అనంతరం ఖైదీలు విస్తరాకులు కుట్టే విభాగాన్ని పరిశీలించారు. నేర అంగీకారపూర్వక విధానం- ముద్దాయి తన తప్పును తెలుసుకొని చేసిన నేరాన్ని అంగీకరించడం వలన శిక్షాకాలం తగ్గుతుందని ముద్దాయికి వివరించారు. ఇద్దరు ముద్దాయిలను ప్రి బార్గనియింగ్ కొరకు దరఖాస్తు చేసుకొని కార్యదర్శి సలహా ఇచ్చారు. ఈ తనిఖీల్లో మేరీగ్రేస్‌కుమారితోపాటు కారాగార సూపరింటెండెంట్ సుబ్బారావు సిబ్బంది తదితరులు ఉన్నారు.