శ్రీకాకుళం

కలెక్టర్ ధనంజయరెడ్డి సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 15: జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి విధినిర్వహణలో అంకితభావం అలాగే జిల్లాను ఓడి ఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు రచ్చబండ కార్యక్రమం, రంగసాగరం పనులు ప్రారంభానికి మంగళవారం ముఖ్యమంత్రి విచ్చేశారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లాలో శతశాతం మరుగుదొడ్లను నిర్మించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్ పెంచిన ఒత్తిడి వెనుక తన ఆదేశాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. శతశాతం మరుగుదొడ్ల నిర్మాణాల్లో భాగంగా పలువురు అధికారులు, అలాగే లబ్ధిదారులు ఇబ్బందలు ఎదుర్కొన్న విషయం తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే తన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని సి ఎం వివరణ ఇచ్చారు. ఇటువంటి అధికారికి పూర్తిగా సహకరించిన జిల్లా యంత్రాంగానికి సి ఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.