శ్రీకాకుళం

బీజేపీ నేతల విజయోత్సాహాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 15 : కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో 104 స్ధానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం పట్ల మంగళవారం జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ కూడలి వద్ద జిల్లా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపి నేతలంతా మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం మాట్లాడుతూ కర్ణాటకలో కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్ణాటకలో బీజేపి కి ఓటు వేయొద్దంటూ ప్రచారం చేసినప్పటికీ బీజేపికే ప్రజలు ఓటు వేసి మద్దతు తెలిపారన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు పూడి.తిరుపతిరావు, మహిళ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొద్దు భాగ్యలక్ష్మీ, జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శవ్వాన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రాక కోసం ఎదురుచూపులు
నరసన్నపేట/పోలాకి, మే 15 : నియోజకవర్గంలోని సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసేందుకుగానూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రులు, అధికార ప్రతినిధులు జిల్లాకు ప్రజాప్రతినిధులు నిరీక్షించడం కనిపించింది. మంగళవారం జిల్లా విచ్చేసిన ముఖ్యమంత్రి నిర్థేశించిన సమయానికే చేరుకున్నారు. అయితే ఉదయం నుంచే సి ఎంకు స్వాగతం పలికేందుకు వేచి ఉండడం కనిపించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మంత్రులు కళా వెంకటరావు, ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి,కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, వి.అశోక్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్సీ కావల ప్రతిభాభారతి, మొదలవలస రమేష్ తదితరులు వేచి ఉండటం కనిపించింది.