శ్రీకాకుళం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 15 : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మట్టి కరవడం ఖాయమని వైసీపీ నేత , మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర 2000కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండవ రోజు మంగళవారం జగన్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. గార మండలం రామచంద్రాపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర జొన్నలపాడు, ఒప్పంగి మీదుగా అరసవెల్లి, అరసవెల్లి జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి పాతబస్టాండ్ మీదుగా ఏడురోడ్ల జంక్షన్‌కు చేరుకొని ఏడురోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఆరు నెలలుగా పాద యాత్ర చేస్తున్నారని మండుటెండలు, గాలివానలు, పిడుగులను సైతం లెక్క చేయకుండా పర్యటిస్తున్నారన్నారు. మంగళవారం గార మండలం రామచంద్రాపురం నుండి జగన్‌కు మద్దతు గా పాదయాత్ర ప్రారంభించామని వేలాది మంది ఈ పాద యాత్రలో పాల్గొన్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రతీ ఒక్కరికి ఒక్కొక్క హామీ ఇచ్చారని ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం కలిగిందా అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని దీనితో రైతులు అప్పులపాలవుతున్నారని అన్నారు. వైసీపి గుర్తుతో గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. ఎచ్చెర్లలో విమానాశ్రయం, శ్రీకాకుళం నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దుతానని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. స్టేడియంను కూలదోసారని వాటి నిర్మాణం ఇంతవరకూ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మళ్లి మాయ చేసే పనులు చేపడుతున్నారన్నారు. గ్రామాల్లో విభజించి పాలించారని ప్రస్తుతం అందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెపుతున్నారని, వైసీపి అంటే భయం కలిగిందా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మట్టి కరిపించడం ఖాయమన్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి తీరా వారు ఎస్టీ జాబితాలో చేర్పించాలని అడిగితే వారిని రౌడీలతో కొట్టించారని పేర్కొన్నారు. రైతులు కష్టాల్లో పడ్డారని తెలియజేశారు. జిల్లాలో వంశధార, తోటపల్లి పనులు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రెండింటిని పూర్తి చేసి రెండవ పంటకు కూడా నీరందిస్తామన్నారు. ఇసుక దోపిడీ వెనుక ఎమ్మెల్యేలే ఉన్నారని పేర్కొన్నారు. నీరు, చెట్టు పేరుతో ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ధర్మాన ప్రసాదరావుకు దారి పొడవునా మహిళలు, కార్యకర్తలు, అభిమానులు నీరాజనాలు పలుకుతూ పూల మాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసి ఎం ఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు ఎంవి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాసరావు, మూకల తాతబాబు, జెడ్పీటీసి చిట్టి జనార్ధనరావు, పీస గోపి, శ్రీహరి, టి.కామేశ్వరి, చల్లా రవికుమార్, ఎన్ని ధనుంజయరావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, వైవి సూర్యనారాయణ వివిధ గ్రామాల నుండి వైసీపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బురుజువాడలో సీఎంకు ఘన స్వాగతం
* ఇంటింటికి వెళ్లిన చంద్రబాబునాయుడు
నరసన్నపేట, మే 15 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో బురుజువాడ గ్రామంలో పర్యటించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దత్తత తీసుకున్న బురుజువాడ గ్రామాన్ని సీఎం సందర్శించారు. స్వచ్ఛ్భారత్ పథకం క్రింద నిర్మాణం చేస్తున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి తమ గ్రామానికి రావడంతో ఆనందోత్సవాలతో ఆయనకి స్వాగతం పలికారు. ప్రతీ ఇంటికి వెళ్లిన చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు, లోపాలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కళావెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మేల్యేలు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, వి.అశోక్, ఎమ్మెల్సీ కావలి ప్రతిభ భారతి, కైజోలా యాప్ జిల్లా కో ఆర్డినేటర్ భీష్మాప్రసాద్ జెడ్పి చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.