శ్రీకాకుళం

బొంతు ఎత్తిపోతల పథకానికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మే 15 : మండలంలో బొంతు ఎత్తిపోతల పథకం ద్వారా 11,700 ఎకరాలకు రెండు పంటలకు అవసరమైన సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ పథకం నిర్మాణానికి రంగసాగరం చెరువుగట్టు వద్ద మంగళవారం భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం నిర్మాణానికి రూ.180కోట్లు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు. 69గ్రామాల పరిధిలో గల వ్యవసాయ భూమికి సాగునీరుతో పాటు, చెరువుకు ఎగువ ప్రాంతాలు గల 87 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఈ పథకం ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధ్యక్షత వహించగా రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కిమిడి కళా వెంకటరావు, సత్యనారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అడారు సమీపంలో
చుక్కల జింక మృతి
వీరఘట్టం, మే 15: మండలంలోని అడారు గ్రామ బీసీ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చుక్కల జింక మృతి చెందింది. తూడి, వండువ గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతంలో గత కొంతకాలంగా వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అడవి పందులు, జింకలు తాగునీటి కోసం మైదాన ప్రాంతాల్లోకి వచ్చి రోడ్డుప్రమాదాలకు, వేటగాళ్లకు బలవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో తాగునీటి కోసంకొండ కిందకు వచ్చిన జింకను అదే గ్రామ సమీపంలోని తోటలో వీధి కుక్కలు వెంటాడి పొట్టన పెట్టుకున్నాయి. అయితే రెండు నెలల వ్యవధిలో గ్రామంలోకి జింక చోడి, జొన్న పంటలను తిని అజీర్ణంతో నీరు లేక గిలగిటకొట్టుకుంటూ చనిపోయిందని పశువైద్యాధికారి చైతన్య కృష్ణ నిర్ధారించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ బీట్ అధికారి సోమేశ్వరరావు, సిబ్బంది భవానీ శంకర్, పార్వతీశం, శ్రీరామ్, నీలవేణి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు సమక్షంలో పంచనామా జరిపి జింకను పోస్టుమార్టమ్ జరిపి ఖననం చేశారు. కొండలపై ఉన్న వన్యమృగాలకు దాహం కోసం వచ్చి మృత్యువాత పడకుండా తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. వేటగాళ్ల బారిన పడకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.