శ్రీకాకుళం

తపాలా శాఖ ఉద్యోగులు సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 22 : పోస్టల్ శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు వేతన సవరణకై మంగళవారం నుండి సమ్మెలోకి దిగారు. రాష్ట్ర పోస్టల్ జెసి ఎ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె శ్రీకాకుళం డివిజన్‌లో విజయవంతంగా జరిగిందని ఆ సంఘ నాయకుడు వీరభద్రారావు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టల్ తపాలా కార్యాలయం వద్ద ఉద్యోగులంతా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతన సవరణకై ఏర్పాటు చేసిన కమలేశ్‌చంద్ర కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించి 18నెలలు కావొస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుందన్నారు. కమిటీ నివేదిక అమలు చేయాలని కోరుతూ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా పోస్టల్ ఉద్యోగుల సంఘాలన్ని సమ్మె చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో మూడా ప్రధాన తపాలా కార్యాలయాలతో పాటు పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం 400కు పైగా సబ్‌పోస్ట్ ఆఫీస్‌లు, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లు ఈ సమ్మె వలన మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కమలేశ్‌చంద్ర కమిటీ సిఫార్సు చేయాలని లేని ఎడల సమ్మెను మరింత ఉదృతం చేస్తామని పోస్టల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి డి వీరభద్రారావు, వి విజయకృష్ణ, బి చంద్రమోహన్, టి సాంబమూర్తి తెలియజేశారు.

రిమ్స్‌లో ఆందోళన
శ్రీకాకుళం(రూరల్), మే 22 : పాముకాటుకు గురైన చిన్నారికి సకాలంలో వైద్యం అందించడంలో వైఫల్యం కారణంగా చిన్నారి మృతి చెందడంతో రిమ్స్‌లో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. గార మండలం శాలిహుండంకు చెందిన చిన్నారి జోషిక పాముకాటుకు గురికావడంతో సోమవారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడం వలనే చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. మంగళవారం మృతదేహంతో రిమ్స్ వద్ద నిరసన తెలియజేశారు. విషయాన్ని తెలుసుకున్న రిమ్స్ ఉన్నతాధికారులు మంగళవారం బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా డ్యూటీ వైద్యులు బాధ్యత వహించాలని చిన్నారి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గార మండలం శాలిహుండం కు చెందిన దుబ్బక రమణ, రోషిణిలకు జోషిక, తనీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ కేబుల్ టీవి పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రమణ ఇంట్లోకి గోధుమ రంగు నాగుపాము ప్రవేశించి ఇంట్లో ఆడుకుంటున్న జోషిక ఎడమకాలికి కాటు వేసింది. పాము కాటు వేసిన విషయాన్ని జోషిక కుటుంబసభ్యులకు చెప్పడంతో గార లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించాలని సూచించారు. 108కు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఆటో సహాయంతో చిన్నారిని రిమ్స్‌కు తీసుకువచ్చారు. రిమ్స్‌లో చిన్నారి మృతి చెందడంతో గ్రామస్తులు స్ధానిక వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. ఉన్నతాధికారులు వచ్చి సంజాయిషి చెప్పడంతో పరిస్ధితి సర్దుమనిగింది. ఎం సి ఐ బృందం కూడా సంఘటన వద్దకు చేరుకుని అక్కడ సమాచారాన్ని తెలుసుకున్నారు.