శ్రీకాకుళం

కేంద్రం సహకరిస్తే రాష్ట్రం అభివృద్ధి పధంలో నిలిచేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం,మే 22: కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానంతో రాష్ట్ర విభజన చేపట్టడంతో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లందని, విభజన హామీలన్నింటినీ సక్రమంగా అమలు చేస్తారని ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పొత్తు నెరిపితే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నమ్మించి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా మహానాడు మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు ఆశయం నినాదంతో టీడీపీ ఆవిర్భావం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోట్ బడ్జెట్‌తో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారని, నాలుగు సంవత్సరాల తన పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో అగ్రగామిగా నిలిపారన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్భ్రావృద్ధికోసం చంద్రబాబునాయుడు ఎనె్నన్నో పథకాలు రూపొందించారని, ముఖ్యంగా రైతన్నల సంక్షేమం కోసం వారి పంటలకు నీరందించే దిశగా జిల్లాకు జీవనాడి అయిన వంశధార పనులు పూర్తి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆఫ్‌షోర్ పనులను, వంశధార-నాగావళి అనుసంథానంతో పాటు జిల్లాలో సాగునీరు, తాగునీరు అందించేందుకు గాను కోట్లాది రూపాయలు మంజూరు చేసేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు ఆదరణ, పెన్షన్‌లు, రుణ రాయితీలు అందజేసి ఆదుకొన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన చంద్రబాబునాయుడన్నారు. గ్రామ గ్రామానికి రోడ్లు, జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపొందించేందుకు మరుగుదొడ్ల నిర్మాణం, ఇళ్లులేని నిరుపేదలకు గృహాలు, గృహ నిర్మాణాల కోసం ఆర్థిక వనరులను కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ నేత జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార దాహంతో మూకమ్ముడి దాడికి దిగారని కాని రాష్ట్రంలో చంద్రబాబు పాలనపైన, తెలుగుదేశం పార్టీపై ప్రజలకు అపార విశ్వాసం వుందన్నారు. 2019లో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఐదు కోట్లు ఆంధ్రులకు అత్యవసరమని ఆ దిశగా ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు.