శ్రీకాకుళం

అరసవిల్లికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 17 : ప్రత్యక్ష నారాయణుడు శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సాధారణ సమయాల్లో భక్తులు అంతంత మాత్రం గా ఉన్నప్పటికి ఆదివారాల్లో మాత్రం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనానికి భక్తులు వేచి ఉండటం కనిపించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికి ఎండను సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉండడం కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిచవచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అధిక జేష్ఠ మాసం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో విశేష అర్చనలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. దివ్యాంలకరణతో భాస్కరుడు భక్తులకు దర్శమిచ్చారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఈవో శ్యామలాదేవి ఆధ్వర్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శన భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి టెంట్లువేసి, మంచి నీటి సౌకర్యాన్ని కల్పించారు. సూర్యనమస్కారాలు చేయించేందుకు కూడా భక్తులు వేచివుండటం కనిపించింది. ఈ వారం వంద రూపాయల టిక్కెటు ద్వారా రూ.46,300, కేశ ఖండన ద్వారా రూ.9,110, సూర్యనమస్కారాల ద్వారా రూ.7,800, పులిహోర, లడ్డు విక్రయాల ద్వారా రూ.1,70,000 ఆదాయం లభించినట్లు ఈవో శ్యామలాదేవి తెలిపారు.