శ్రీకాకుళం

లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు పెన్ డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 17 : రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల అనుమతులను వేగవంతం చేసేందుకు 2016 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టం మంచిదే అంటూ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు ఆరోపిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆన్‌లైన్‌లో ప్లాన్ అప్రువల్ అపలోడ్ చేయకుండా నిరసన తెలియజేస్తున్నారు. దీంతో కొత్తగా నిర్మాణాలు చేపట్టే ఇళ్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌ల సమస్యలు పట్టించుకోకపోవడంతో రాష్టవ్య్రాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంజనీరింగ్, ఎల్ సి ఇ అభ్యర్ధులకు ఈ నెల 18వ తేదీన సోమవారం శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భవనాల ప్లాన్‌లు గీసే లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ నిరసనలు వ్యక్తం చేయడం తో భవన నిర్మాణదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ ఇంజినీరింగ్‌లో పట్ట్భద్రులకు, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ డ్రాయింగ్స్ పై శిక్షణ ఇచ్చేందుకు ఒక్క రోజు వర్కుషాపును నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం నగరపాలక సంస్ధ కమీషనర్ శ్రీరాములు నాయడు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు నగరపాలక సంస్ధ కౌన్సిల్ సమావేశంలో శిక్షణా తరగతులు నిర్వహించబడునన్నారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బి ఇ, బి ఆర్, ఎల్ సి ఇ, డి సి ఇ, ఐటి ఐలలో సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులు లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు అర్హులని తెలిపారు. ఔత్సాహికులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.