శ్రీకాకుళం

నాయి బ్రాహ్మణుల ఆత్మ గౌరవం దెబ్బతీస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూన్ 19 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని తమ సమస్యలను చెప్పుకోవాలని వెళ్లిన నాయి బ్రాహ్మణులను తూలనాడటం సహంచబోమని వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. స్ధానిక వైసీపి కార్యాలయంలోమంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందన్నారు. దీనికి చంద్రబాబుకు దళిత మైనార్టీలపై నీచమైన అభిప్రాయమే కారణమన్నారు. తమను ఆదుకుంటారని ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని కానీ ఆయన తీరు మాత్రం బడుగు బలహీన వర్గాల పట్ల జుగుప్సాకారంగాను, అవమానకరం గాను వ్యవహరిస్తుందన్నారు. ఆత్మగౌరవంతో నాయి బ్రాహ్మణులు పనిచేస్తున్నారని వారు అత్యంత దయనీయ పరిస్ధితుల్లో జీవిస్తున్నారన్నారు. తనని కలవడానికి వెళ్లిన నాయి బ్రాహ్మణుల తోక కత్తెరిస్తానని చంద్రబాబు పేర్కొన్నప్పటికి ఆ కత్తెర నాయి బ్రాహ్మణుల దగ్గరే ఉన్నదని సంగతి మరిచారన్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేదిలేదని కనీస వేతనం ఇవ్వమని కోరడమే వారు చేసే తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పరిస్ధితులు గమనించిన వైసీపీ నేత జగన్మోహనరెడ్డి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, గుండుకు రూ.50 చొప్పున అందిస్తానని హామి ఇచ్చారన్నారు.ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అందవరపు సూరిబాబు, పొన్నాడ రుషి, కె ఎల్ ప్రసాద్, నాయి బ్రాహ్మణ నాయకులు సీ హెచ్ లక్ష్మణరావు, కన్నారావు, కె శ్రీనివాసరావు, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.