శ్రీకాకుళం

ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల,జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పర్యవేక్షణలో ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్షను ఈ నెల 11 న ప్రారంభించి మంగళవారం వరకు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఇంజనీర్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో టెట్ పరీక్ష కొనసాగించగా 2210మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షకు 2162 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను రాష్ట్ర విద్యాశాఖా అధికారులతో పాటు స్థానిక ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి.గోవిందరాజులు పర్యవేక్షించారు. ప్రశాంతంగా టెట్ పరీక్షలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కాంగ్రెస్ దశ, దిశ నిర్దేశకులు రాహుల్
* మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్
శ్రీకాకుళం(టౌన్), జూన్ 19 : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దశ, దిశ నిర్దేశకులు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ అన్నారు. స్ధానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మురళీమోహన్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. యువనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొని విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ 48వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు డిసిసిబి చైర్మన్ డోల జగన్, మజ్జి శారద, పీరుకట్ల విశ్వప్రసాద్ తదితరులు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ గాంధీ 48వ జన్మదినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు సనపల అన్నాజీ, రత్నాల నరసింహమూర్తి డి ఎస్ కె ప్రసాద్, కె వి ఎల్ ఈశ్వరి, బాన్న రాము, తదితరులు పాల్గొన్నారు.