శ్రీకాకుళం

శ్రీకాకుళం నుంచి.. బీజేపీ..పక్కా ప్లాన్..ప్రారంభం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఏపీలో మరో ఆరుమాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతాపార్టీ ఏపీలో 75 నియోజకవర్గాల్లో పూర్తికాలం కార్యకర్తలను నియమించి, వారిని జిల్లా పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ళల్లోనే వారికి అద్దెకు గదులు, భోజన వసతి కల్పించి నాలుగు దశాబ్ధాల్లో జరగని అభివృద్ధి, సంక్షేమం మోదీ సర్కార్ 48 నెలల్లో ఏమీ చేసిందన్న ప్రచారానికి బీజేపీ సైన్యం ప్రజల ముందుకు వెళ్ళనున్నది. ఆ దిశగానే శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ మరింత పటిష్టంగా పనిచేసేందుకు కార్యాచరణను అమలు చేసేందుకు బుధవారం నుంచి రెండురోజులపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించనున్నారు. ఫుల్‌టైమర్లు నియోజకవర్గం నేతలతో సంబంధాలు లేకుండా నేరుగా శ్రీకాకుళం జిల్లా కార్యాలయం పర్యవేక్షణలో పనిచేస్తారు. ప్రతీ రోజూ ఒక గ్రామానికి లేదా పట్టణాల్లోని ఒక డివిజన్‌కు వెళ్ళి పనిచేస్తారు. అక్కడి నేతలతో కలిసి పనిచేస్తారు. బూత్ కమిటీలను వేస్తారు. క్షేత్రస్థాయి నుంచి బీజేపీ సిద్ధాంతాలతో ముందుకుసాగుతారు. ఇటువంటి కార్యకర్తలందరికీ ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్, ఏబివిపి వంటి సంస్థలు తోడవుతాయి. పక్కా ప్లాన్‌తో వారు ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎండగట్టేపనిని పూనుకున్నారు. అందుకు శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ప్రభుత్వ కేబినేట్, చివరికి అసెంబ్లీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకతను గమనించి, ఆ ప్రాంతాల నేతలపై బీజేపీ ప్రచ్ఛన్నయుద్ధానికి సంసిద్ధం అవుతోంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి కార్యకర్తలను నియమించింది. ఒక్కోక్కరికి మోటార్‌సైకిళ్ళు ఇచ్చి, గ్రామాల్లో మోదీ సర్కార్ 48 నెలల్లో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువైతే వారిలో సంతృప్తిని కనిబెట్టే డిటెక్టివ్ ఉద్యోగాలే కాకుండా, నేరుగా వారితో మాట్లాడి నాలుగు దశాబ్ధాలుగా గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి, సంక్షేమం 48 మాసాల్లో మోదీ సర్కార్ చేసి చూపిన విధానాలపై రచ్చబండ చర్చలకు తెరతీయనున్నారు. బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న మంత్రులు, వారి అవినీతి, అసత్యపు ప్రకటనలను ప్రజల్లోకి తీసుకువచ్చే పని మాత్రమే వీరు చేసేందుకు సుశక్తులుగా బీజేపీ శిక్షణ ఇచ్చి సుమారు 3000 మందిని జిల్లాకు పంపించింది. దీంతో పకడ్బందీగా ఎన్నికల వ్యూహరచనను అమలు చేసేందుకు బీజేపీ మూహూర్తం ఈశాన్య దిశగా ఉన్న శ్రీ అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధి నుంచే ఆరంభించేందుకు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కటీఫ్ అయిన బీజేపీ తెలుగుదేశంపార్టీతో సంబంధం లేకుండా కింద స్థాయి వరకూ విస్తరించాలనే వ్యూహాంతోనే బీజేపీ పనిచేసేందుకు సిద్ధపడుతుంది. అయితే, టీడీపీ తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేస్తుందా, బలాన్ని చూపించి ఎక్కువ సీట్లును టీడీపీ నుంచి చీల్చి రాబట్టేందుకు ప్రయత్నిస్తుందా అనేది బీజేపీ వ్యూహాత్మక అడుగులు మరో కొద్ది గంటల్లో తేలనున్నది. యూపీ వ్యూహాన్ని అనుసరించినంత మాత్రాన బీజేపీ ఏపీలో ఫలితాన్ని సాదిస్తుందా అనేది సందేహమే. ఏపీ సమస్యలన్నీంటికీ కేంద్రానే్న ఎత్తిచూపుతూ చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ప్రతాపం చూపించారంటూ బాబు చేసే వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో బీజేపీ నేతలు సక్కెస్ కాలేకపోయారన్నది నిజం. అయితే, రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయ లక్ష్యాల సాధనకు బీజేపీ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. 3బరిలో నిలిచి పరుగుతీస్తూ ఉంటాం. పార్టీని బలోపేతం చేస్తూ వెళతాం..టీడీపీతో ఉండాలా? వైసీపీతో పొత్తు పెట్టుకోవాలా?? అనేది ఎన్నికల నాటికి నిర్ణయిస్తాం2 అంటూ ఇటీవలే ఒక సీనియర్ బీజేపీ నేత చెప్పిన మాటలే శ్రీకాకుళం జిల్లాకు కూడా వర్తిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. 2019 ఎన్నికల్లో ఎక్కువ ఎం.పీ. సీట్లు ఇచ్చేవారే కావలన్నదే బీజేపీ మదిలోగల మంత్రాంగం. అందుకు సిద్ధాంతపరమైన శక్తులను కూడగట్టుకునేందుకు జిల్లాలవారీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా పర్యటనల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి ఆరంభం అవుతుందని ఆ పార్టీ నేతలే 3ఆంధ్రభూమి2కి చెప్పడం గమనార్హం!

వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఏపి బిసి శాసన సభ కమిటి అధ్యక్షులు తిప్పేస్వామి

శ్రీకాకుళం, జూన్ 19 : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల శాసన సభ కమిటీ అధ్యక్షులు జి తిప్పేస్వామి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ కులాల సంఘాల నాయకులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసిల సంక్షేమానికి ఎన్నడూ లేని విధంగా చంద్రబాబునాయుడు నాలుగు సంవత్సరాల్లో రూ.40వేల కోట్ల కేటాయించారన్నారు. దీని ద్వారా వారి ఆర్ధిక అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆయా కులాలకు ఆర్ధిక సహాయాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిల వర్గాల పిల్లల చదువు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. వెనుకబడ్డ తరగతుల పిల్లల చదువుకోసం స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా విదేశాల్లో చదువుకునే వారి కోసం రూ.10లక్షలను అందిస్తున్నట్లు తెలిపారు. కుల, చేతి వృత్తిదారులకు ఆదరణ-2 పథకం ద్వారా రూ.800కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక ఇబ్బందుల్లో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో సమర్ధవంతంగా అమలు చేస్తున్నారన్నారు. బీసిలకు సంబంధించి 85గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గుణాత్మక విద్య అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నది, లేనిది తెలుసుకోవడానికి, అవి ఎంత మేరకు సద్వినియోగపడుతున్నది తమ పర్యటనలో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో బిసిలకు రిజర్వేషన్ల అమలు జిల్లాలో సక్రమంగా జరుగుతున్నది లేనిది కూడా తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, బిసి కమిటి సభ్యులు బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, రాజనర్శింహులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అంబేద్కర్ వర్సిటీకి జూలై 9న గవర్నర్ రాక
* ముస్తాబవుతున్న విశ్వవిద్యాలయం
ఎచ్చెర్ల,జూన్ 19: జిల్లా అభివృద్ధిలో భాగమైన అంబేద్కర్ విశ్వ విద్యాలయానికి మొదటిసారి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జూలై 9న ఛాన్సలర్ హోదాలోవిచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో క్యాంపస్‌లోని విద్యార్థులు, ఆచార్యులు, సహాచార్యులుతో నేరుగా మాట్లాడి గవర్నర్ విశ్వ విద్యాలయం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించనున్నారు. గవర్నర్ పర్యటన ఖరారు అయినట్లు ఉపకులపతి కూన రామ్‌జీ స్పష్టం చేసారు. ఛాన్సలర్ హోదాలో తొలిసారి విచ్చేస్తున్న గవర్నర్ నరిసింహన్‌కు ఘనంగా స్వాగతం పలికేలా విశ్వవిద్యాలయాన్ని మరింత ముస్తాబు చేస్తున్నారు. 2008లో అంబేద్కర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్‌గా ఉన్న క్యాంపస్‌ను విశ్వవిద్యాలయంగా అప్పటి ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులను జారీచేసింది. అంతేకాకుండా ఉపకులపతిని కూడా నియమించి సుమారు 200 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయాల అవసరానికి ప్రభుత్వం కేటాయించింది. పదహారు విభాగాలు, 17 కోర్సులుతో పరిడిల్లే విశ్వవిద్యాలయంలో మరిన్ని వౌళిక సదుపాయాలు కల్పనకు గడిచిన బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్యాంపస్ పరిధిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణలు ప్రారంభించి ఇక్కడ విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకు కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ వస్తుంది. జర్నలిజం,యోగా వంటి సరికొత్త కోర్సులు నెలకొల్పి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేలా ఇక్కడి అధికారులు మరిన్ని సంస్కరణలకు తెరలేపారు. అయితే 12బి, నేక్ వంటి అనుమతులు నేటికి రాకపోవడం ఈ కారణంగా యూజీసీ నిధులు మంజూరు కాని ప్రతికూల పరిస్థితులు ఇక్కడ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఆచార్యులు, సహాచార్యులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో సుమారు 65మంది టీచింగ్ అసోషియేట్స్ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల బోధనా సిబ్బంది నియామకానికి స్కీనింగ్ టెక్స్ట్ నిర్వహించి భర్తీ కసరత్తును ఆరంభించింది. పరిశోదనాత్మకమైన విద్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఇక్కడ వసతులు కరువనే చెప్పాలి. సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉన్న క్యాంపస్‌లో పూర్తిస్థాయి వౌళిక సదుపాయాలు లేకపోవడంతో సమస్యలు అపరిస్కృతంగా దర్శనమిస్తున్నాయి. వసతి గృహాలు, లేబ్‌లు, ఆసుపత్రి, స్టేడియం, విశ్రాంతి గదులు వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేలా గవర్నర్ ఛాన్సలర్ హోదాలో వరాల జల్లు కురిపిస్తారని ఇక్కడ బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆశతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.