శ్రీకాకుళం

మందపల్లికి రెడ్‌క్రాస్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, జూన్ 22: మండలంలోని రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు మందపల్లి రామకృష్ణారావుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అవార్డు లభించింది. ఇటీవల జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ధనుంజయరెడ్డి ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ పి.జగన్మోహన్‌రావుల చేతుల మీదుగా రామకృష్ణారావుకు రజిత పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పాఠశాలలో జూనియర్ రెడ్‌క్రాస్ సొసైటీని స్థాపించి రెడ్‌క్రాస్ పట్ల విద్యార్థుల్లో చైతన్యం కలిగించి విశేష సేవలు అందిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ అవార్డును బహుకరించింది. మందపల్లికి అవార్డు రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.కృష్ణతో పాటు సహ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
సరుబుజ్జిలి, జూన్ 22: ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే ఆరోగ్యం లభిస్తుందని వైద్య సిబ్బంది అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చునన్నారు. తద్వారా ఆరోగ్య సాధన సాధ్యమవుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, పాలు వంటి బలవర్థకమైన ఆహారం ప్రతిరోజూ మానవ శరీరానికి అందించడం ద్వారా రక్తంలోని రక్తకణాలు పుష్కలంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని వైద్య సిబ్బంది నమోదు చేసి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తహీనతకు గల కారణాలు తెలియజేస్తూ రక్తాన్ని వృద్ధి చేసే ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు.