శ్రీకాకుళం

సిరిమాను సంబరానికి వేళాయే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), మే 15: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని అరసవల్లి, కాజీపేట వాసుల ఇలవేల్పు అసిరితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 19న పెద్ద ఎత్తున ప్రారంభమైన ఈ సంబరాలు ఈనెల 17 మంగళవారం నాటి సిరిమాను ఊరేగింపు, అనుపు ఉత్సవాలతో ముగుస్తాయి. 2007లో జరిగిన ఈ ఉత్సవాలను తొమ్మిదేళ్లకొకసారి నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం జరుపుతున్నారు. ఉత్సవాల్లో తొలి దశలో భాగంగా వేపచెట్టు కొట్టి దుర్గమ్మ, నీలమ్మ, ఎర్రన్న ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను తయారీలోనూ ప్రత్యేక ఉంది. ఇందుకోసం ఈనెల 12న చింతచెట్టును గుర్తించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిరిమాను తయారీ మొదలుపెట్టారు.
ఈ ఉత్సవాల్లో అమ్మవార్లను ఆవాహన చేస్తూ కోటపోయడం కూడా విశేషమే. దుర్గమ్మ, నీలమ్మలకు కోటపోసిన అనంతరం అసిరితల్లి అమ్మవారికి కోటపోయడంతో ఉత్సవాలు ముగింపు దశకు చేరుతాయి. వంశపారంపర్యంగా దమ్మల కులస్తులు అసిరితల్లి అమ్మవారికి అర్చన నిర్వహిస్తారు. సిరిమానును ఈ వంశానికి చెందిన పిరియా అప్పారావు అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. సిరిమాను సంబరం మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు స్థానిక ఎమ్మెల్యే నివాసం సమీపంలోని దుర్గమ్మ మట్టి వద్ద లాంఛనంగా ప్రారంభమై పురవీధుల్లో ఊరేగింపు కొనసాగుతుంది. రాత్రి 7గంటల సమయంలో అరసవల్లి పొలిమేరల్లోని అసిరితల్లి ఆలయానికి చేరుతుంది. అనుపు ఉత్సవంతో ఈ గ్రామదేవత సంబరాలు ముగుస్తాయి. అరసవల్లి రహదారులన్నీ ఇప్పటికే పండగ కోలాహలంతో జనసంద్రంగా మారిపోయాయి. దూర ప్రాంతాల నుండి బంధువర్గం అమ్మవారి పండుగలకు అరసవల్లి తరలిరావడంతో సందడి కనిపిస్తుంది. ట్రాఫిక్‌ను సైతం అరసవల్లి జంక్షన్ నుండి పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ జంక్షన్ నుంచి అసిరితల్లి ఆలయం వరకు విద్యుత్ దీపాల కాంతులు విరజిమ్ముతున్నాయి.