శ్రీకాకుళం

ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూన్ 22: పలాస నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలాస నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు రైతులు కోసం కష్టపడాలని, ఈ ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో శివారు ప్రాంతాల్లో సైతం సాగునీరు అందించే విధంగా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో వున్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సిద్దం చేయాలని చెప్పారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులు సానుకూలంగా స్పందించి సాగునీరు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీరు శశిభూషణ్, కార్యనిర్వహక ఇంజనీరు రంగారావు, ఎ ఇలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్ర ఆసుపత్రి పలాసలో ఏర్పాటు చేయాలి
* కదం తొక్కిన యువత * పలు పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు
పలాస, జూన్ 22: జిల్లా కేంద్ర ఆసుపత్రిని పలాసలో ఏర్పాటు చేయాలంటూ పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు శుక్రవారం పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ఆరోగ్యరక్షణ వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటూ ర్యాలీ నిర్వహించగా, ముందుగా కాశీబుగ్గలో గల గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని కాశీబుగ్గ మూడు రోడ్లు జంక్షన్ నుంచి శ్రీనివాస్‌లాడ్జి మీదుగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీపీ ఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు చాపర సుందరలాల్, జనసేన నాయకులు సుజాతపండా, ప్రజాసంఘాల నాయకులు బి. ఓంకార్, సీపీ ఎం నాయకులు బమ్మిడి ఆనంద్‌లు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తర్వాత అతి పెద్ద వాణిజ్యకేంద్రం పలాస అని, పలాసకు ఆనించి వున్న విస్తారమైన జాతీయరహదారి ఉండడంతో తరచు రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. పలాసలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నా రోగులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని, జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీపీ ఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ ఆసుపత్రులకు మద్దతు తెలుపుతుండడంతో ప్రభుత్వ వైద్యశాలలు నిర్వీర్యమవుతున్నాయని, పలాసలో వేలాది మంది కార్మికులు ఉన్నారని, వారికి ఐ ఎస్ ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పాలకులు గాలికి వదిలివేసారని, పలాసలో 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నేడు పార్టీలకు అతీతంగా యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ప్రభుత్వం గుర్తించి, తక్షణమే పలాసకు 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ఆరోగ్యరక్షణ వేదిక సభ్యులు కొర్రాయి శ్రీకాంత్, ఎన్.అనిల్‌కుమార్, వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్, మెట్ట కుమారస్వామి, పైల చిట్టి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.