శ్రీకాకుళం

చంద్రన్న బీమా పథకం ఒక వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూన్ 22: చంద్రన్నబీమా పథకం మృతుల కుటుంబాలకు ఒక వరమని 12వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి, ఎ ఎంసి డైరెక్టర్ ఎం.డి.అబ్దులఖాన్ అన్నారు. శుక్రవారం 12వ వార్డులోని అప్పారావు మృతి చెందడంతో భార్యకు చంద్రన్న బీమా పథకం కింద 5 వేల రూపాయలు నగదును అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కుకోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతుందనే దృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న బీమా పథకం ద్వారా ఆర్థికసహాయం అందజేస్తున్నారన్నారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చంద్రబాబు ఆ మాటను నిలుపుకోవాలనే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్నారన్నారు. అటువంటి నేత మనకు దొరకడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో బీమా మిత్ర తులసీ, పి.గోవిందు, జి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ఎలుగుబంటి దాడుల్లో ఇంకా ఎంతమంది బలైతే స్పందిస్తారు:చైర్మన్
పలాస, జూన్ 22: ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంటి దాడుల్లో ఎంతో మంది బలి అవుతున్నారని, ఇంకా ఎంతమంది బలి అయితే స్పందిస్తారని పలాస నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. శుక్రవారం కాశీబుగ్గలోని అటవీశాఖ సిబ్బందికి వినతిపత్రం అందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జీడి పిక్కల కాలంలో ఎలుగుబంటులు దాడులు సర్వసాధారణంగా మారాయని, అధికారులు స్పందించకపోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది తీవ్ర గాయాలతో తమ జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. అటవీశాఖాధికారులు సకాలంలో స్పందిస్తే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. అటవీశాఖాధికారులు మానవతాదృక్పథంతో ఎలుగుబంటుల బాధితులను ఆదుకోవాలని కోరారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఎలుగుబంట్లు సంచారం ఎక్కువగా ఉన్నప్పటికి అటవీశాఖాధికారులు వాటి కట్టడికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరని, ఇప్పటికైనా అటవీశాఖాధికారులు స్పందిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడేవారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బి.శ్రీనివాసరావు, బమ్మిడి సంతోష్, సవర సుమన్, పి.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.