శ్రీకాకుళం

అన్ని దానాల కంటే రక్త దానం గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్22: జిల్లాలో రక్త నిల్వలు కొరతగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద ఓ ఆసుపత్రిలో జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వలు సరిపడినంతగా లేవని అందువలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని జిల్లాలోని ప్రతీ ఒక్కరూ విధిగా రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులందరూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసి రక్తదానం చేయడం సంతోషదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని ప్రతీ ఆసుపత్రిలోను రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలకు కలెక్టర్ అభినందించారు. జిల్లాలో ఆరోగ్యంగా వున్న వారందరూ రక్తాన్ని దానం చేయాలని రక్తదానం చేయడం ద్వారా చాలామంది ప్రాణాలు కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులకు అవసరమయిన ప్లేట్ లెట్స్ రక్తం నుండే లభిస్తాయని, అంతేకాకుండా రక్తం కొరత వలన ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారందరికీ రక్తదాతలు ఇచ్చే రక్తం సంజీవని అని కలెక్టర్ వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వళన చేసిన అనంతరం రక్తదాతలకు ధృవీకరణ పత్రాలను, పండ్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్. తిరుపతిరావు, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ఎమ్. వెంకటరావు, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ జె. నారాయణరావు, డాక్టర్ పిజెనాయుడు, చైతన్యకుమార్ పాల్గొన్నారు.
దుకాణదారులకు శాశ్వత పరిష్కారం చూపాలి
పలాస, జూన్ 22:రైతుబజారు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులకు శాశ్వతపరిష్కారం చూపాలని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావుకు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం తహసీల్థార్ కార్యాలయంలో వైసీపీ నాయకులు, దుకాణదారులు ఆర్డీవోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుకాణదారులు తరపున అప్పలరాజు మాట్లాడుతూ రైతుబజారు ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారులను తక్షణమే ఆదుకొని వారికి రాయితీపై శాశ్వత వ్యాపార సముదాయాలను నిర్మించాలని డిమాండ్ చేసారు. రైతుబజారు పేరుతో అధికారులు వ్యాపారస్తులకు ఇక్కట్లు కలగజేయవద్దు అని విన్నవించుకున్నారు. వ్యాపారస్తులంతా మున్సిపాలిటీకి ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారని, రైతుబజారు నిర్మాణంతో వ్యాపారసముదాయాలను ఖాళీ చేయించే యోచన విరమింపజేసుకొని అధికారులు వ్యాపారస్తులకు అండగా ఉండి వారికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందుకు ఆర్డీవో స్పందిస్తూ వ్యాపారస్తులకు న్యాయం జరుగుతుందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్, బడగల బాలచంద్రుడు, మెట్ట కుమారస్వామి, తమ్మినేని శాంతారాం, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

బ్రాహ్మణతర్లా ఫీల్డ్ ఆసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి
పలాస, జూన్ 22:బ్రాహ్మణతర్లాలోని ఉపాధి కూలీలను ఇక్కట్లు గురి చేస్తున్న ఎన్ ఆర్‌జి ఎస్ ఫీల్డ్ ఆసిస్టెంట్‌ను తక్షణమే విధులు నుంచి బహిష్కరించాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేసారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఫీల్డ్ ఆసిస్టెంట్‌ను విధులు నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసారు. ఎంపీడీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ బ్రాహ్మణతర్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 23 గ్రూపులు ఉండగా, అందులో శ్రీ వెంకటేశ్వర, తల్లిసీతమ్మ, వినయ్‌గ్రూపులకు డిమాండ్ ఫారమ్ ఫీల్డ్ ఆసిస్టెంట్ అందించగా, ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుమారు 20 మంది ఈ నెల 21వ తేది నుంచి వారం రోజులు పాటు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసారు. ఉపాధి కూలీలు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఫీల్డ్ ఆసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీనిపై ఎంపీడివో సానుకూలంగా స్పందిస్తూ విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు వేణు, జ్యోతి, రమణ, సీతమ్మ, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.