శ్రీకాకుళం

వైఎస్ పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్),జూన్ 22 : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన పథాకాలన్నీ కాంగ్రెస్‌పార్టీకే చెందుతాయని శ్రీకాకుళం నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ చౌదరి సతీష్ అన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వై ఎస్సార్ పేదల కోసం పనిచేసారని జగన్మోహనరెడ్డి వ్యక్తి గత స్వార్ధం కోసం పనిచేస్తున్నారని తెలియజేసారు. వై ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు పేదల అభివృద్ధి కోసమేనని తెలిపారు. జగన్మోహనరెడ్డి వ్యక్తిగత ఎజెండాతో ముఖ్యమంత్రి కుర్చీకోసం పాటుపడుతున్నారన్నారు. వై ఎస్ మరణాంతరం పదవి కోసం తల్లిలాంటి పార్టీపై విషం జల్లిన గుణం జగన్‌దని, అంతిమ శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే పనిచేసారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా మాటతప్పకుండా, మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వై ఎస్సార్ అని అన్నారు. వై ఎస్ ఆస్థులకు జగన్ వారసుడు తప్ప ఆయన ఆశయాలకు వారసుడు కాదని పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో ముస్తాక్‌మహమ్మద్, రత్నాల నర్శింహమూర్తి, కడగల నాగరాజు, ఎమ్ ఏ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

ఓక్రిడ్జ్ పాఠశాలలో నాయకత్వ లక్షణాలు
శ్రీకాకుళం(రూరల్),జూన్ 22: విశాఖపట్నంలో వెలిసిన ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మనోవికాసం పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా బోధన సాగుతుందని ప్రిన్స్‌పాల్ బిజుబేబీ తెలిపారు. స్థానిక హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలనుంచి వచ్చి విద్యార్థులు ఓక్రిడ్జ్ పాఠశాలలో అడ్మిషన్లు పొందుతున్నారని తెలియజేసారు. ఓక్రిడ్జ్ పాఠశాలలో 60శాతం సమయాన్ని ఎకడమిక్ కోసమని మిగిలిన 40శాతం ఇతర కల్చరల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం పనిచేస్తుందని తెలియజేసారు. మిగిలిన పాఠశాలల్లో ఒత్తిడి వుంటుందని పేర్కొన్నారు. ఓత్తిడి వలన విద్యార్థుల మనోవికాసం పెంపొందదని తెలియజేసారు. ఓక్రిడ్జ్‌లో మాత్రం నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ మనోవికాసానికి తోడ్పాటు నిస్తామన్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ జరుగుతుందని, ఏ ఇంటర్యూకు హాజరైన విద్యార్థి సమర్ధవంతంగా ఎదుర్కోగలరన్నారు. ఈ సమావేశంలో హిమబిందు, లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
* ఏ ఐటిసి డిమాండ్
శ్రీకాకుళం(రూరల్)జూన్ 22: రాష్ట్ర ఏ ఐటిసీ పిలుపు మేరకు కనీస వేతనాలు పెంపుదలపై బోర్డు తక్షణమే స్పందించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం డిప్యూటీ లేబర్ కమీషనర్ కార్యాయలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఐటిసీ కౌన్సిల్ సభ్యుడు చిక్కాల గోవిందరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెం. 11 స్థానంలో కొత్త జీవోను విడుదల చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టే 279 జీవోను రద్దుచేయాలన్నారు. మెడికల్, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెం.69 స్థానంలో కొత్త జీవోను విడుదల చేయాలన్నారు. కనీస వేతనం రంగంలో ఉన్న 65 షెడ్యూల్‌లో కాలపరిమితి ముగిసిన జీవో స్థానంలో కొత్త జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేసారు. 6,10 పీ ఆర్‌సీ కి ముందు మధ్యంతర భృతి ఇచ్చిన వారందరికీ పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని, ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
శ్రీకాకుళం(రూరల్),జూన్ 22: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. జిల్లాలో జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు బంద్‌కు మద్దతునిచ్చారు. జూనియర్ కళాశాలలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఎయిడెడ్ కళాశాలలో ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్తులు వెంటనే భర్తీ చేయాలని, కార్పొరేట్ కళాశాలలో కొనసాగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం జూనియర్ మహిళా కళాశాల విద్యార్థినిలతో ర్యాలీ నిర్వహించారు. కళశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఎమ్.సత్యన్నారాయణ, జిల్లా కో కన్వీనర్ బి.నాగేంద్ర, జిల్లా మహిళా కన్వీనర్ కె.్భర్గవి,ప్రసాద్, చిరంజీవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.