శ్రీకాకుళం

కళింగ సామ్రాజ్యంలో కింజరాపు పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు,జూలై 6: దేశంలో 554 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఒకే ఒక పార్లమెంట్ నియోజక వర్గం పేరు తలపిస్తే కళింగ సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది. ఆ సామ్రాజ్యంలో చక్రవర్తిగా పార్లమెంట్ సభ్యుడు, దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు గుర్తుకు వస్తారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్(బేగంపేట), విమానాశ్రయం, దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో 1952 నుండి 1984 వరకు 30 సంవత్సరాల బి ఆర్ వస్తున్నారని సర్వం సిద్ధంగా ఉండేది. 1967లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గౌతు లచ్ఛన్నపై రాజగోపాలరావు ఓటమి చవిచూసాడు. కొద్ది నెలల్లో గౌతు లచ్చన్న తన రాజకీయ గురువు ఎన్‌జీ రంగా కోసం రాజీనామా చేసి జరిగిన ఉపఎన్నికల్లో రంగాపై రాజగోపాలరావు ఓడిపోయారు. 1984 తెలుగుదేశం ప్రభంజనంలో మరోసారి తెలుగుదేశం అభ్యర్థి హనుమంతు అప్పయ్యదొరపై ఓటమి చవిచూసారు. 1989-91లోజరిగిన ఎన్నికల్లోకణితి విశ్వనాధం విజయం సాధించారు. కళింగుల అనైక్యతకు నిదర్శనంగా 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కళింగులు పోటీకి దూరంగా ఉండటంతోదివంగత నందమూరి తారకరామారావుతనయుడు నందమూరి జయక్రిష్ణ ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ (సింహం)తరుపున దివంగత కింజరాపు ఎర్రంనాయుడు మొట్టమొదటిగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించారు. అదే పదునుగా 1998 లోజరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 1999 లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో, 2004లో నాలుగు దఫాలుగా 13 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించి కళింగ సామ్రాజ్యంలో వెలమ కులస్థులు పాగా వేసారు. 2009లో మళ్లీ కళింగ సామాజిక వర్గానికి చెందిన కిళ్లి కృపారాణి ఎంపీగా విజయం సాధించడం కేంద్ర మంత్రిగా వ్యవహారించడం సామాజిక వర్గానికి ఆ కులానికి ఒక రికార్డుగా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం దివంగత ఎర్రంనాయుడు అభిమానులు ఆయన రాజకీయ చతురతతో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అత్యథిక మెజార్టీతో విజయం సాధించారు. 1952నుండి 2014 వరకు 16సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 12 దఫాలుగా 44 సంవత్సరాలు పాటు కళింగ సామాజిక వర్గం ఎన్నిక కాగా నాలుగు దఫాలుగా 18 సంవత్సరాలు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక కుటుంబం వ్యక్తి కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్థుత ఎంపీ రామ్మోహన్నాయుడే పాలించారు. రానున్న ఎన్నికల్లో కులాల కుంపటి రాజుతుంది. ముందస్తు ఎన్నికలు వాతావరణం అనుమానంతో రాజకీయ పార్టీలు జిల్లాలో సాశించే కళింగ, కాపు, వెలమ సామాజిక ప్రధాన వర్గాలు తమ తమ ఆధిపథ్యపోరు సాగించేందుకు చాప కింద నీరులా ప్రస్థుత రాజకీయాలు జరుగుతున్నాయి.