శ్రీకాకుళం

సోలార్ విద్యుత్ సరఫరాలో రెండోస్థానంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతబొమ్మాళి, మే 17: దేశంలో సోలార్ విద్యుత్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండోస్థానానికి తీసుకువెళ్లేందుకు సిఎం చంద్రబాబునాయుడుతోపాటు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఎపి ఇపిడిసి ఎల్ చీఫ్ మేనేజరు కె ఎస్ ఎన్ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన సంతబొమ్మాళి విద్యుత్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం దేశ ప్రధాని సొంత రాష్టమ్రైన గుజరాత్‌కు సోలారు వెలుగులతో ప్రథమ స్థానంలో ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ మండలంలో పైలట్ ప్రాజెక్టుతో 450 పాత పంపుసెట్లును మార్చామని, ఇంకా మరో 2 లక్షల వరకు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. విద్యుత్ శాఖ పశ్చిమగోదావరి జిల్లా నర్శపురం మండలంలో లక్ష సీలింగ్ ఫ్యాన్‌లు ఇచ్చేందుకు కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఫైవ్‌స్టార్ కంపెనీకి చెందిన ఫ్యాన్ ఖరీదు 1180 రూపాయలు అని, 24 వాయిదాల్లో చెల్లించవచ్చునన్నారు.