శ్రీకాకుళం

పాలిథిన్‌ను నివారించడం చేతకాకపోతే తప్పుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 17: పలాస మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ సంతోషంగా హాజరైనప్పటికి చివరిలో ఆ సంతోషం ఆవిరైపోగా, మున్సిపల్ చైర్మన్‌పై కో ఆప్షన్‌సభ్యురాలు లక్ష్మి అనుచిత వ్యాఖ్యాలు చేయడం పట్ల తోటి కౌన్సిలర్లు ఆమెను సముదాయించి శాంతింపజేసారు. కో ఆప్షన్‌సభ్యురాలు లక్ష్మి పాలిథిన్ నిషేధించాలని తాను ఏడాది నుంచి గొంతెత్తి ప్రశ్నిస్తున్నా ఎందుకు నిషేధించడం లేదని, నిషేధంలో లాలూచీ ఏమిటి అని ఒకానొక సమయంలో నిలదీయగా, దీనిపై చైర్మన్ కమిషనర్ రమేష్‌నాయుడు వివరణ ఇవ్వాలని సూచించారు. కమిషనర్ తనదైన శైలిలో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తాను ప్రశ్న రూపంలో సమాధానం ఇవ్వడంతో ఆమె అసహనం వ్యక్తం చేసారు. ఆమెకు మద్దతుగా కో ఆప్షన్‌సభ్యుడు కొత్తకోట భానుమూర్తి, ఇతర సభ్యులు మద్దతు తెలిపినప్పటికి అంశాన్ని ప్రక్కనపెట్టారు. నాలుగేళ్లు పరిపాలనపై కౌన్సిల్‌లో తన అనుభవాలను చెప్పాలని కౌన్సిలర్లుకు కోరడంతో సభ సజావుగా జరిగింది. సభ చివరిలో మరోమారు లక్ష్మిప్రధాన్ పోడియం ముందుకువచ్చి చైర్మన్‌పై విరుచుకుపడడంతో తోటి మహిళ కౌన్సిలర్లు ఆమెను సముదాయించిన తనకు సమాధానం చెప్పాలని పట్టుబడుతుండగా మొరగడం సరైన పద్దతి కాదని అనడంతో ఆమె మరింత ఫైర్ అవుతూ మీ పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలని, చైర్మన్‌గా చేతకానివారు ఎమ్మెల్యేగా ఏమి ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు వివరణ కోరగా, కో ఆప్షన్‌సభ్యురాలు లక్ష్మిప్రధాన్ గౌరవ సమావేశ మందిరంలో అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని తీవ్రంగా బాధించిందని, దీనితో తోటి కౌన్సిలర్లు ఆమె తీరుకు నిరసనగా ఆమెను సస్పెండ్ చేయాలని కోరారని, రానున్న సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జి.సూర్యనారాయణ, కౌన్సిలర్లు దువ్వాడ శ్రీకాంత్, బల్ల ఉష, మల్లా కృష్ణ, పైల చక్రధర్, ముకుంద, కె.సురేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారించకుంటే మెరుపుసమ్మె
పలాస, జూలై 17: పలాస మున్సిపాలిటీలో పారిశుద్ద్య కార్మికుల సమస్యలను పరిష్కారించకుంటే మెరుపుసమ్మె చేస్తానని సీ ఐటియు నాయకులు ఎన్.గణపతి హెచ్చరించారు. మంగళవారం పలాస మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుద్ద్య కార్మికులు బైఠాయించి వేతనాలు తక్షణమే చెల్లించాలని సమస్యను పరిష్కారించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబరు 151 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, పి ఎఫ్, ఇ ఎస్ ఐ డబ్బులు ఖాతాలో జమ చేయాలని, లేకుంటే ఆ డబ్బులు కార్మికులకు నేరుగా అందజేయాలని డిమాండ్ చేసారు. జీవో 279ను రద్దు చేసి సోసైటీలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని, పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, కమిషనర్ పర్యవేక్షణలో పి ఎఫ్, ఇ ఎస్ ఐ ఉంచి జవాబుదారీగా ఉండాలని, ఒప్పందం ప్రకారం కార్మికులకు చట్టపరంగా రావాల్సిన అనేక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మురగన్, భాస్కరరావు, ఎం.బలరాం, ఈశ్వరరావు, రవి, నిహారిక, పి.సీతమ్మ, ఎస్.గులాబీ తదితరులు పాల్గొన్నారు.
పలాస ప్రభుత్వాసుపత్రిలో రక్తనిల్వ కేంద్రం
పలాస, జూలై 17: పలాస ప్రభుత్వాసుపత్రిలో రక్తనిల్వ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నామని పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గాలి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రక్తనిల్వ కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శివాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కృషి ఫలితంగానే రక్తనిల్వ కేంద్రం ఏర్పాటుతోపాటు ఆసుపత్రి అభివృద్ధి జరిగిందన్నారు. భవిష్యత్తులో రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు గాను మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.