శ్రీకాకుళం

యుజిసీ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 17: యూనివర్శిటీ గ్రాంటు కమిషన్ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వినోద్ డిమాండ్ చేసారు. మంగళవారం పలాస తహసీల్థార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం తహసీల్థార్ కల్యాణచక్రవర్తికి వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ యుజిసీ స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఉందని, యుజిసి విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూరుస్తుందని, కొత్తగా రాబోయే భారతీయ విద్యా కమిషన్‌కు ఆ అధికారం ఉండదని, ఇక ముందు కేంద్ర మానవవనరుల శాఖ నిధులు మంజూరు చేసే అధికారం ఉంటుందన్నారు. దీనితో విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సిలబస్ నుంచి బోధన, పరిశోధన మొదలగు అంశాలను హెచ్ ఇ సి ఐ పర్యవేక్షిస్తుందన్నారు. ఏ దేశంలోనైనా ఉన్నత విద్యను ఆ సమాజానికి అనుసరించి అవసరాలు తీరుస్తారు గాని ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అనిల్, ఉమాశంకర్, రాజు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధి అంతానికి పరిష్కారం చూపండి
* బాధితులకు గ్లో సంస్థ బాసటగా నిలుస్తుంది
పలాస, జూలై 17: ప్రతిపక్షనాయకులు, ఉద్దాన అభివృద్ధి వేదికలు అసత్య ఆరోపణలు కాకుండా కిడ్నీ వ్యాధి అంతానికి పరిష్కారం చూపినట్లైతే వాటిని తెలుగుదేశం ప్రభుత్వం సహకారం అందిస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. కిడ్నీ వ్యాధి బాధితులకు 2014 సంవత్సరం ముందు నుంచే గ్లో సంస్థ బాసటగా ఉండి ఎన్నో సౌకర్యాలను సమకూర్చిందన్నారు. భవిష్యత్తులో గ్లో సంస్థ ద్వారా భారత్ పెట్రోలియం సంస్థ సహకారంతో ఆర్‌వో ప్లాంట్‌లు, విశాఖ పోర్టు ట్రస్టు ద్వారా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. కిడ్నీ బాధితులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షనాయకులు, యుడి ఎఫ్ అసత్య ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ పరిపాలన రాక ముందు వాటి కోసం ఏమి చేసారని, అప్పుడు వ్యక్తిగతంగా సహాయం చేసామని, ఈ వ్యాధి అన్ని ప్రాంతాల్లో ఉందని, ఉద్దానంలో తీవ్రంగా ఉండడంతో విమర్శలు చేస్తున్నారన్నారు. సంఘాలకు, నాయకులకు చిత్తశుద్ది ఉంటే వ్యాధి రాక ముందే ప్రజల్లో చైతన్యం కల్పించి పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. రోగులు కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసామని, గత ప్రభుత్వాలు చేయనవి తాము చేసినప్పటికి ప్రతిపక్షనాయకులైన డాక్టర్లు అదే పనిగా విమర్శించడాన్ని తప్పు పట్టారు. గౌతు శిరీషా మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ కిడ్నీ వ్యాధిబాధితులపై స్పందించకముందే సీ ఎం చంద్రబాబునాయుడు రాజాం సభలో కిడ్నీ వ్యాధులు కోసం 2500 రూపాయలు పింఛన్లు పరిశీలనలో ఉందని చెప్పడాన్ని గుర్తు చేసారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఇస్తే కిడ్నీ వ్యాధిని అరికడదామని చెప్పడం కాదని, ఐదుగురు నెఫ్రాలజిస్టులను తీసుకువస్తే కిడ్నీ వ్యాధిబాధితులపై అభిమానం ఉన్నట్లైనన్నారు. ఈ సమావేశంలో పలాస ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, టీడీపీ నాయకులు లోడగల కామేశ్వరరావు, జి.సూర్యనారాయణ, బడ్డ నాగారాజు, నిమ్మాన బైరాగి తదితరులు పాల్గొన్నారు.