శ్రీకాకుళం

గ్రామదర్శినిలో అధికారులను నిలదీసిన ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఆగస్టు 10: తమ గ్రామంలో నెలకొన్న పారిశుధ్ధ్యం, రహదారి సౌకర్యం సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం గ్రామదర్శిని వేదికగా నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని మండలంలోని గొర్రెబంద గ్రామ ప్రజలు అధికార యంత్రాంగాన్ని నిలదీసారు. శుక్రవారం ఈ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి మండల పరిషత్ ప్రత్యేకాధికారిగా ఉన్న కోటేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. సభ ప్రారంభంలోనే గొర్రెబంద ప్రజలు గ్రామంలో పారిశుద్ధ్యలోపం అధికంగా ఉందని, అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ రహదారిపై చెరువుమట్టిని కుప్పలుగా వేశారని, దీనివలన రహదారి సౌకర్యం కోల్పోయామని ప్రజలు వివరించారు. ఈమట్టిని తక్షణమే తొలగించి రహదారి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు సమస్యలను నాలుగు రోజుల్లోగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చిన తర్వాత గ్రామ సభ కొనసాగింది. కోనావాని పేట గిరిజన మహిళలు మాట్లాడుతూ తమ గ్రామాన్ని బురుజువాడ చౌకధరల డిపో పరిథినుండి మార్చి గొర్రెబంద డిపో పరిథిలోనికి తేవాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని తహశీల్దార్ ఈశ్వరమ్మ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించిన అధికారులు రహదారులపై, పాఠశాలల వద్ద, దేవాలయాల స్థలంలో పశువులను కట్టరాదని ఆదేశించారు. గ్రామంలోనున్న చెత్తను తక్షణమే తొలగించాలని డీటీవో కోటీశ్వరరావు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఈశ్వరరావు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిగుళ్లు త్రుంచి వరినాట్లు వేయండి
సారవకోట, ఆగస్టు 10:ఖరీఫ్ వరినాట్లు వేసినప్పుడు అవసరమైన ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఎంపీఈవోదిలీప్ సాహూ రైతులకు సూచించారు. మండలంలోని లక్ష్మీపురం తదితర గ్రామాల్లో వరినాట్లు వేస్తున్న పంట పొలాలను సందర్శించి రైతులకు సలహాలిచ్చారు. చివరి దమ్ములో డిఏపి తోపాటు పొటాష్‌ను విధిగా వేయాలన్నారు. నారుమడినుండి వరినాడును తీసినవెంటనే చిగుళ్లను త్రుంచివేసి బురదలో వేయాలన్నారు. దీనివలన వరినాడు చిగుళ్లలోనున్న ఆకుముడత తదితర క్రిములు లార్వా నశించిపోతాయని ఆయన వివరించారు. చిగుళ్లు త్రుంచివేసిన నారు ఊడ్పులు చేయడం వలన వరి చేనుకు తెగుళ్లు రాకుండా నివారించగలమని రైతులకు సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

విజయవంతంగా డీ వార్మింగ్ కార్యక్రమం
సారవకోట, ఆగస్టు 10: మండలంలో శుక్రవారం చేపట్టిన డీవార్మింగ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని స్థానిక వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజన అనంతరం విద్యార్థులచేత ఈ మాత్రలను మింగించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనివలన కడుపులో నులిపురుగులు నశిస్తాయని, తద్వారా రక్తహీనతను నివారించుకోగలమన్నారు. మండలంలో గల అంగన్వాడీ కేంద్రంలో గల పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ మాత్రలను పంపిణీచేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మండల విద్యాశాఖాధికారి ఎమ్.విరమణ, వైద్యశాఖ పర్యవేక్షకులు రామక్రిష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, ఐఈడి సిబ్బంది పాల్గొన్నారు.