శ్రీకాకుళం

సాధికార మిత్రాలతో అభివృద్ధి సాద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఆగస్టు 10: ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటుచేసిన సాధికార మిత్రాలు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం అవుతున్నాయా, లేదా అన్నదానిపై ఇంటింటా సర్వే జరిపి పథకాలు సద్వినియోగానికి నిరంతరం శ్రమించాలని మండల ప్రత్యేకాధికారి జిల్లా విద్యాశాఖాధికారి ఎమ్.సాయిరాం అన్నారు. మండలం గుగ్గిలి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామంలో సాధికార మిత్రాలకు అప్పగించిన 35 కుటుంబాల్లో లబ్ధిదారులుతో చర్చించి ప్రభుత్వం అందిస్తున్న పలు పథాకాలు అందుతున్నాయా లేదా చర్చించాలని డీఈవో అన్నారు. కుటుంబంలో ఇంకా పథకాలు అందకపోయినా, సమస్యలున్నా తెలుసుకొని వాటి వివరాలను ఉన్నతాధికారులకు తక్షణమే అందించాలని ఆయన స్పష్టం చేశారు. సాధికార మిత్రాలు ఎంతో ఉన్నతమైనవారని, బాధ్యతగా రాజకీయాలతీతంగా పనిచేసి ప్రభుత్వ పథాకాల్లో లబ్ధిదారులను చేర్పించాలన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో నిర్మించిన వందలాది మరుగుదొడ్లను సద్వినియోగంపై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని వారికి సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు సాధికార మిత్రలు వారథిలాంటివారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పడాల వాసుదేవరావు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకందించిన పలు రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె.ప్రవళిక ప్రియ రెవెన్యూ సమస్యలపై వివరించగా పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు ప్రభుత్వం తరుపున పంచాయతీలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బమ్మిడి మాధవరావు, ఇంజనీరింగ్ అధికారులు సత్యన్నారాయణ, నాగభూషణం, పలు శాఖా అధికారులతో పాటు మాజీ సర్పంచ్ ప్రతినిథి కరవంజ కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

97 శాతం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
* వైద్యాధికారి పవన్‌కుమార్
జలుమూరు, ఆగస్టు 10: జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిథిలో శుక్రవారం నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ 97శాతం పూర్తయిందని వైద్యాధికారి సూరపు పవన్‌కుమార్ తెలిపారు. జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిథిలో 1వ తరగతినుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల వరకు తన సిబ్బంది స్వయంగా మాత్రలు అందజేసి వేయించారని, మిగిలిన ఇంటింటికీ వెళ్లి పిల్లలకు మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జలుమూరు బాలిక ప్రభుత్వ హైస్కూల్‌లో, బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థిణీ, విద్యార్థులకు వైద్యాధికారి పవన్‌కుమార్ సిబ్బందితో వెళ్లి నేరుగా అందజేశారు.
కరవంజలో డీఈవో మాత్రలు పంపిణీ
మండలం కరవంజ, గుగ్గిలిగ్రామాల్లో పాఠశాల విద్యార్థులకు శుక్రవారం మండల ప్రత్యేకాధికారి, జిల్లావిద్యాశాఖాధికారి ఎమ్.సాయిరాం నులిపురుగుల మందులను అందజేశారు. కడుపులో నున్న నులిపురుగుల వలన అనేక అనార్థాలు ఏర్పడతాయని, కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యాధులు బయటపడతాయని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. నులిపురుగులు అన్న పిల్లల్లో అధికంగా కన్పిస్తాయని, ఈ మందుల వలన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆయనతో పాటు ఎంపీడీవో పడాల వాసుదేవరావు, మండల విద్యాశాఖాధికారి మాధవరావు ఉన్నారు.