శ్రీకాకుళం

ఎటువంటి నష్టం రానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, మే 20: మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోను తుపానుకు మత్స్యకార ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు రానివ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అధికారులకు ఆదేశించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో మండలాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలైన గుప్పిడిపేట, గొల్లవానిపేట, రాజారాంపురం, కొత్తరేవు, కొవిరిపేట తదితర గ్రామాల మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే వంశదార నది ఒడ్డున గల వనితమండలం, డోల పల్లిపేట గ్రామస్థులను వంశదార నదిలోనికి వెళ్లకుండా సూచనలిచ్చి అవగాహన కల్పించాలన్నారు. వీలైనంతవరకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు వైద్య సౌకర్యం, తాగునీరు కల్పించాలన్నారు. ఎమ్మెల్యే రమణమూర్తితో మాట్లాడుతూ నరసన్నపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోగల ప్రత్యేకాధికారులకు అవసరమైన సూచనల, సలహాలు అందించాలన్నారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మండల ప్రత్యేకాధికారి జయరాజ్, ఏఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, మండల ప్రత్యేక సలహాదారు భూషణరావు, ఎంపిడివో లక్ష్మీపతి, తహశీల్దార్ జెన్ని రామారావు, డిప్యూటీ తహశీల్దార్ సత్యన్నారాయణ, పశువైద్యాధికారి లక్ష్మణరావు, ఏ వో గాయిత్రీ తదితరులు ఉన్నారు.