శ్రీకాకుళం

స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఆగస్టు 24 : నేడు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. గ్రామ స్ధాయిలో ఉన్న పాఠశాలల నుండి మండల స్ధాయి కార్యాలయంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం వలన మండల స్ధాయి అధికారులు ఎవరు మండల కేంద్రంలో అందుబాటులో ఉండనందున సహాయ అధికారులతో వేడుకలు జరుపుటకు సిద్ధమయ్యాయి.
కరవంజ, గొళియాపుట్టి లో పొలం పిలుస్తుంది
జలుమూరు, ఆగస్టు 14 : మండలం కరవంజ, గ్రామ పంచాయితీ గుళియాపుట్టి గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఇన్‌ఛార్జ్ వ్యవసాయాధికారి కె వెంకటరావు ఆయా గ్రామాల్లో వ్యవసాయ పనులను స్వయంగా పరిశీలించారు. కాలిబాట సాగువలన చీడ, పీడలు దూరంగా ఉంటాయని అన్నారు. సేంద్రీయ ఎరువులు వినియోగించుట వలన మంచి దిగుబడులు సాధించవచ్చునని రైతులకు సూచించారు. ప్రస్తుతం వ్యవసాయ పొలాల్లో చేలు బాగానే ఉన్నాయని రైతులు సిబ్బంది సూచనల మేరకే ఎరువులు, ఇతర క్రిమ సంహారక మందులు వినియోగించాలని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఆత్మా బీటి ఎం పి రాజశేఖర్, మాజీ సర్పంచ్ జి అప్పలనాయుడు పలువురు రైతులు, ఎంపి ఇవో వై సరోజిని, జి జ్యోతిలు పాల్గొన్నారు.
1001కి ప్రత్యామ్నాయంగా తరంగణి విత్తనాలు
* ఏడి జి సత్యవతి
జలుమూరు, ఆగస్టు 14 : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1001 విత్తనాలకు ప్రత్నామ్యాయంగా 11-56,11-53 తరంగణి విత్తనాలను మండలం లింగాలవలస, మర్రివలస గ్రామాల్లో సాగు జరుగిందని నరసన్నపేట అగ్రికల్చర్ డైరక్టర్ జి సత్యవతి అన్నారు. పై గ్రామాల్లో మంగళవారం పర్యటించి తరంగణి విత్తనాల వేసే పొలాలను పరిశీలించారు. వ్యవసాయ, సాంకేతిక యాజమాన్య సంస్ధ తీసుకున్న దత్తత గ్రామాలు లింగాలవలస, మర్రివలసలో మొట్టమొదటిగా ఈ ఏడాది ఈ సాగును చేయిస్తున్నట్లు ఆమె అన్నారు. ప్రస్తుతం చేలు సక్రమంగా ఉన్నాయని భారీగా పెరుగుతాయని కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం ఉన్నందున జింక్ సల్ఫేట్ లీటర్ నీరుకు రెండు గ్రాములు కలిపి పిచికారి చేయాలని ఆమె సూచించారు. ఈ సాగు వలన అధిక దిగుబడులు వస్తాయని ఆమె ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్తజ్ఞ్రులు వెంకటరావు, ఆమెతో పాటు పొలాలను పరిశీలించారు. తరంగణి సాగు దిగుబడి బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వ్యవసాయాధికారి కె వెంకటరావు, బ్లాక్ టెక్నాలజి మేనేజర్ పాగోటి రాజశేఖర్ ఎంపి ఇవోలు రైతులు పాల్గొన్నారు.
శ్రావణ పూజలందుకున్న ఆంజనేయుడు
జలుమూరు, ఆగస్టు 14 : శ్రావణ మాసం చవితి తిధి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మండల కేంద్రం జలుమూరు జోనంకి అభయాంజనేయ స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో ఆంజనేయ స్వామి ఆలయాల్లో శ్రావణ మాసం మొదటి మంగళవారం ప్రత్యేక పూజలందుకున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మరికొంత మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని చేపట్టారు. తెలుగు మాసాల్లో శ్రావణం ముఖ్యమైన మాసం, శుభమాసమని శాస్త్రంలో ఉన్నందున ప్రత్యేక పూజలు జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తుందని పలువురు భక్తులు తెలిపారు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అభివృద్ధి చేశా
* ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, ఆగస్టు 14 : నరసన్నపేట నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులకు రాష్ట్రం లోనైనప్పటికి తన వంతు కృషిగా ప్రజా శ్రేయస్సును గుర్తుంచుకొని అన్ని విధాల అభివృద్ధి చేసానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేసారు. మంగళవారం మండల కేంద్రంలోని టీడీపి కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు తాము ఎదుర్కొన్నప్పటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు రూ.600కోట్లకు పైగా నిధులను మంజూరు చేయించుకోగలిగానని ఆయన వివరించారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సారవకోట మండలంలోని ఎత్తిపోతల పథకానికి రూ.185కోట్ల తో నిధులను మంజూరు చేయించానని, జలుమూరు మండలంలో రూ.20కోట్లకు పైగా రక్షిత మంచినీటి పధకాన్ని తెప్పించుకోగలిగానని వివరించారు. నరసన్నపేట, పోలాకి మండలాల్లో కూడా గడచిన 30 సంవత్సరాలకు పైగా ఎదురుచూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తన హయాంలోనే శ్రీకారం చుట్టానని స్పష్టం చేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నారా చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని సమర్ధించడం ఖాయమని తన గెలుపు కూడా సునాయసనంగా గెలవడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం స్ధాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సుద్దముక్కలపై గాంధీజీ చిత్రపటం
నరసన్నపేట, ఆగస్టు 14 : మండల కేంద్రంలోని స్ధానిక లచ్చుమన్నపేటకు చెందిన కళాకారుడు వీరమల్లు నాగనర్శింహాచారి హస్తాలతో రాట్నం ఒడుకుతున్న గాంధీ మహాత్ముని చిత్రాన్ని సుద్దముక్కలపై తయారు చేసి పలువురు దృష్టిని ఆకర్షించారు. మంగళవారం స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆయన 72వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గాంధీ మహాత్ముని మృతి చిహ్నాన్ని సుద్ద ముక్కలపై తయారు చేసానని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పెన్సిల్ ముల్లుపైన ఎన్నో ఆకృతులను తయారు చేసిన అనుభవం తనకుందని ఈ దిశగానే మహాత్ముని చిత్రరూపాన్ని సుద్దముక్కలపై చిత్రీకరించానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర పండుగ దినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని రూపొందించడంతో స్ధానిక నాయకులతో పాటు పలువురు కళాభిమానులు ఆయనను అభినందించారు.
త్వరలోనే శాలివాహన స్పిన్నింగ్ మిల్ ప్రారంభం
నరసన్నపేట, ఆగస్టు 14 : మండలంలో తామరాపల్లి గ్రామం వద్ద గడిచిన నాలుగు శతాబ్దాలుగా నిరీక్షిస్తున్న స్పిన్నింగ్ మిల్లును త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని శాలివాహన కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ అధ్యక్షుడు మంచు కృష్ణారావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్పిన్నింగ్ మిల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 40క్రిందట చేనేత కార్మికులకు ఆదుకునేందుకు గాను దీని నిర్మాణాన్ని ప్రతిపాదన చేయడం జరిగిందని నేడు అది కార్యరూపం దల్చనుందని వివరించారు. ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేనేత కుటుంబాలకు ఆదుకునే విధంగా ఎన్నో పధకాలను ప్రకటించారని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. గతంలో 20శాతం రాయితీ నూలును అందించేవారని దాన్ని 30శాతం పెంచారని అంతేకాకుండా చేనేత కుటుంబాలకు వర్క్‌షెడ్ తో పాటు గృహాలను కూడా రూ.3,45,000 మంజూరు చేస్తానని హామి ఇచ్చారని పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు ఇది ఎంతో ఆనందదాయకమని అంతేకాకుండా 100యూనిట్ల విద్యుత్ ను అందజేస్తామని తెలిపారని ఈ సందర్భంగా తమ చేనేత కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్‌లు కె ప్రసాదరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
* జెట్పిటిసి శకుంతల
నరసన్నపేట, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతుందని జిల్లా పరిషత్ సభ్యురాలు సీ హెచ్ శకుంతల తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్ధానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడంతో పాటు వౌళిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ దిశగానే విద్యార్ధులకు ఉచితంగా దుస్తులతో పాటు పుస్తకాలు, భోజన సదుపాయాలు కలుగజేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి యు శాంతారావు, ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ?
* బీజేపి రాష్ట్ర కోర్ కమిటి సభ్యులు విశ్వనాథం
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 14 : జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపి రాష్ట్ర కోర్ కమిటి సభ్యులు కణితి విశ్వనాథం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. బీజేపి జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్ధాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగున్నర ఏళ్లలో కనీసం పది సార్లైన శ్రీకాకుళం వచ్చిన చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వందేళ్లు చరిత్ర కలిగిన వంశధార ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవానికి సిద్ధపడుతున్నారని జిల్లా ప్రజల కోసం తమ భూములిచ్చిన నిర్వాసితుల పరిహారం, పునరావాసం ఎప్పుడు తీరుస్తారని అడిగారు. గత నాలుగున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 38 సంస్ధలను రాష్ట్రానికి కేటాయిస్తే ఒక్క సంస్ధ అయినా జిల్లాకు ఇప్పించలేకపోయారా అని ప్రశ్నించారు. ఒక్కసారి తప్పించి అన్ని సార్లు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని తెలుగుదేశం ప్రభుత్వం జిల్లా వలసలను ఆపలేకపోయిందని ఆరోపించారు. మూడు నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు, తాగు నీరు కల్పించే ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం విషయంలో మీ పార్టీ నాయకులే నిరసన దీక్షలు చేపట్టారన్నారు. నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పోలవరం కాలువను శ్రీకాకుళం జిల్లాకు తెచ్చి జిల్లాలోని నదులను అనుసంధానం చేసే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో శ్రీకాకుళం జిల్లాను చేర్చి వుంటే జిల్లాకు మేలుజరిగేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో జిల్లాకు కేటాయించిన ఇళ్లే తక్కువని వాటికే లబ్ధిదారుల ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. హుద్ హుద్ ఇళ్లు నిర్మాణం పూర్తయి కూడా టీడీపి నాయకుల అవినీతి వలన అవి ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాకు కేటాయించిన నిధుల కంటే జిల్లా నుండి ఇసుక రూపంలో దోచుకున్న సంపదే ఎక్కువని ఎద్దేవా చేసారు. అధికారంలో ఉండే ఈ కొద్ది నెలల్లో అయినా జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, ఓబిసి మోర్చ నాయకులు దుప్పల రవీంద్రబాబు, నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, కంచరాన బుజ్జి, సంపతరావు నాగేశ్వరరావు, ఎస్వి రమణమూర్తి, తమ్మినేని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల హామీలను నెరవేర్చాలి
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శ్రీకాకుళం జిల్లా కు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మత్స్యకారులను ఎస్టి జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం ఇచ్చిన హామిను నెరవేర్చాలని జిల్లా మత్స్యకార ఎస్టి సాధన సమితి సభ్యులు, మత్స్యకార సంఘ నాయకులు కోరారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకారులు సామాజికంగా, ఆర్ధికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని రంగాల్లో మిగతా కులాలతో పోల్చి చూసినట్లైతే వెనుకబడి ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ద్వారా తెలిపినట్టు స్పష్టం చేసారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి నేటి వరకు కనీస జీవన ప్రమాణాలకు నోచుకోలేక దారిద్య్రరేఖకు దిగువన ఉండి నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో 2014లో ఎన్నికల ప్రచారంలో టీడీపి అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్టి జాబితాలో చేర్చుతామని హామి ఇస్తూ ఎన్నికల నియమావళి లో పెట్టారని తెలియజేసారు. అలాగే 2017లో విజయవాడ తుమ్మలవలస క్షేత్రంలో జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమంలో ఇచ్చిన వాగ్దానం నేరవేర్చుతానని ప్రకటించినట్లు తెలియజేసారు. ప్రభుత్వం మత్స్యకారుల చిరకాల కోరికను నెరవేరిస్తే తమ పార్టీని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీ తో గెలిపించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పర్చగల శక్తి మత్స్యకారుల ఓట్ల ద్వారా సాధ్యమవుతుందని విన్నవించారు. విలేఖరుల సమావేశంలో కె నర్శింగరావు, చింతపల్లి సూర్యనారాయణ, దూడ సుధ, ఎం లక్ష్ముడు, వారధి ఎర్రయ్య, మోస ఫల్గుణరాజు తదితరులు ఉన్నారు.