శ్రీకాకుళం

ప్రారంభమైన శ్రావణమాస పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 17: శ్రావణమాసం ప్రారంభమై మొదటి శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో పూజలకు మహిళలు బారులుతీరారు. వైష్ణవ ఆలయాల్లో లక్ష్మీదేవి పూజలు, శైవ ఆలయాల్లో పార్వతీదేవి పూజలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. నగరంలోని నానుబాలవీధిలో గల విజయదుర్గా ఆలయం, చిన్నబజారులోని దూదివారి వేంకటేశ్వర ఆలయం, గుడివీధిలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఫాజుల్‌బాగ్‌పేటలో గల వేంకటేశ్వర ఆలయం, పి ఎన్ కాలనీలో గల పంచాయతన దేవాలయాలు, పాతశ్రీకాకుళం లోగల సంతోషిమాత ఆలయం, కొత్తబ్రిడ్జి వద్ద గల దత్తమందిరం లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. దత్త మందిరంలో గాయిత్రీ మాతకు కుంకుమ, పసుపులతోను వివిధ పుష్పాలతోను అష్టోత్తర శతనామావళి సహిత పూజలు నిర్వహించారు. నగరంలో పలు దేవాలయాల్లో లక్ష్మీదేవికి, పార్వతీదేవికి లలితా సహస్ర పారాయణ, శ్రీసూక్త పారాయణ కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాస తొలి శుక్రవారం ఆలయాలన్ని మహిళలతో కళకళలాడాయి. శ్రావణ శుక్రవారం కావడంతో మార్కెట్‌లో పూలకు అమాంతంగా డిమాండ్ పెరిగింది. పూల రేట్లు ఆకాశాన్ని తాకాయి. దీంతో పెద్ద మార్కెట్‌లో గల పూల అంగడి ఎంతో రద్దీగా మారింది. ఎంతో ప్రశస్త్యమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని దేవాలయాలు పూలతోను, మామిడి తోరణాలతోను, విద్యుత్‌దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దీంతో పాటు పెద్దరెల్లివీధిలో గల రామమందిరం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త మందిరంలో వరలక్ష్మీ పూజ, గాయిత్రీ మాత పూజలు అర్చకులు ప్రభాకరశాస్ర్తీ, సత్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తాశ్రమ ట్రస్ట్ బోర్డు మెంబర్ పేర్ల బాలాజీ, విజయకుమార్, మాతృమందిర్ సభ్యులు, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.