శ్రీకాకుళం

నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 17 : నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జెసి-2 పి రజనీకాంతారావు పేర్కొన్నారు. శుక్రవారం నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘ సమావేశం జెసి-2 చాంబర్‌లో జరిగింది. నాయి బ్రాహ్మణులకు వృద్ధ కళాకారుల ఫించన్లను మంజూరు చేయనున్నామని తెలిపారు. మందసలో కమ్యూనిటి భవన స్ధలం కేటాయింపు జరిగినందున త్వరితగతిన నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకుల్లో డిపోజిట్ అవసరం లేకుండా రుణాలు మంజూరు తగు చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లింపులు చేయాల్సిందిగా కోరారు. యూనిట్లను నెలకొల్పి రుణాలు సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సేవాసహకార సంస్ధ కార్యనిర్వాహణ అధికారి జి రాజారావు, డి ఆర్ డి ఎ పిడి డాక్టర్ జి సి కిషోర్‌కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కె శ్రీదేవి, మైనారిటి సంక్షేమ అధికారి ఎం అన్నపూర్ణ, దేవాదాయ శాఖ, నగరపాలక సంస్ధ, తదితర అధికారులు, నాయి బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు ఎం సూర్యనారాయణ, సంక్షేమ సంఘ సభ్యులు జి సన్యాసిరావు, కె వెంకటరమణ, ఆర్ మల్లేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

హైవే ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
* ఎస్పి సీ ఎం త్రివిక్రమవర్మ
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 17 : హైవే ప్రమాదాల నివారణకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పి డాక్టర్ సీ ఎం త్రివిక్రమవర్మ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం హైవే పెట్రోలింగ్ వాహన సిబ్బంది రోడ్డు ప్రమాద నివారణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. హోంగార్డు స్ధాయి నుండి అధికారుల వరకు ప్రతీ ఒక్కరూ భాద్యతగా శ్రమపడ్డారన్నారు. అదేవిధంగా వసతులు తక్కువగా ఉన్న జిల్లా అయినప్పటికి ప్రతీ కార్యక్రమం సక్రమంగా నిర్వహించి విజయవంతం చేసారని రాష్ట్ర డీజిపి ఆర్ పి ఠాకూర్ జిల్లా ఎస్పిని సిబ్బందిని అభినందించారన్నారు. గత నెలలో జరిగిన ప్రమాదాల తీరుపై ఆరాతీశారు. గత ఆరు నెలల నుండి మీడియెన్స్ దాటుతూ రోడ్డు ప్రమాదాలకు గురికావడం పూర్తిగా లేవన్నారు. మీడియెన్స్ ఎక్కడా తొలగించకుండా జాగ్రత్తపడాలన్నారు. అదేవిధంగా డివైడర్‌లో ఉన్న జూబు మొక్కల నుండి సడన్‌గా రోడ్డు పైకి రావడం వలన కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు దీన్ని గమనించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. హైవే పక్కన ఉన్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్ధులు క్రమపద్ధతిలో రోడ్డు దాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రమాదకర ప్రదేశాల్లో హైవే డిపార్ట్‌మెంట్ వారిచే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా ఎటువంటి సంఘటనలు ఉన్నా, అవసరాలు ఉన్నప్పటికి వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టి పనసారెడ్డి, జి గంగరాజు, సి ఐ సత్యనారాయణరెడ్డి, ఆర్ ఐలు రవికుమార్, శ్రీనివాసకుమార్‌లు ఉన్నారు.