శ్రీకాకుళం

కనువిందు చేసిన ఇంద్రధనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 17 : వినీల ఆకాశంలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చిరుజల్లులకు సూర్యకిరణాలు తోడైతే సప్తవర్ణ మిళితమైన ఇంద్రధనస్సు ఆకాశంలో ఆవిర్భవిస్తుంది. ఆకాశంలో అరుదుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో దర్శనమిచ్చింది. సాయంసంధ్య వేళ ఏర్పడిన ఈ రంగుల హరివిల్లు ఇంద్రధనస్సు నగరవాసులకు కనువిందు చేసింది. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.
=========
వాజ్‌పేయ్ ఆమర్ రహే
* నివాళులు అర్పించిన బీజేపీ నేతలు
ఎచ్చెర్ల, ఆగస్టు 17: భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కన్నుమూయడంతో ఆపార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించాయి. భారతరత్న వాజ్‌పేయి దేశాభివృద్ధికి ఎనలేని సేవలు చేసారని పలువురు నాయకులు కొనియాడారు. శుక్రవారం కేశవరావుపేట కూడలిలో పొందూరు చంద్రరావు స్వగృహంలో వాజ్‌పేయి చిత్రపఠానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. వాజ్‌పేయి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకులు సంపతిరావు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. జాతీయ రహదారుల విస్తరణ వంటి బృహత్తర కార్యక్రమం వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీ ఏ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పార్టీనేతలు వౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. వాజ్‌పేయి అమర్ రహే అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో మారుపిల్లి నారాయణరాజు, కె.అనంత, కొత్తకోట చంద్రరావు, బాడాన వెంకటరావు, యతిరాజులు
డిల్లీశ్వరరావు, తమ్మినేని చిన్నవాడు, మొదలవలస రాధాక్రిష్ణ, తవిటిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిలకపాలెం గ్రామంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు వాజ్‌పేయి చిత్రపఠానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని గోవిందరావు, వావిలపల్లి చంద్రరావు, సన్యాసిరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

..............

తీరంలో చేయి చేయి కలిపిన యువత
* నీట మునిగిన బల్లలు ఒడ్డుకు చేరవేత
గార, ఆగస్టు 17: మండలం కళింగపట్నం-మత్స్యలేశం పంచాయితీ పరిధిలోని సాగర తీరం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేపధ్యంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా తీరంలో వివిధ రకాల జంతువుల బొమ్మలుతో పాటు ఇసుక తినె్నలుపై గ్రానైటు బల్లలు (సిటౌట్లు) కూడా ఏర్పాటు చేసారు. అయితే ఈ బల్లలు సముద్ర కెరటాలుకు దగ్గరగా ఉండడం.. వీటికి తోడు యిటీవలి సాగరంలో కెరటాలు ఉధృతి అధికంగా ఉండడంతో ఇసుక తినె్నలు కరిగి బల్లలు కొట్టుకు పోయాయి. ఇలా రెండు, మూడు సార్లు జరగడంతో స్థానిక పంచాయితీ పూర్వపు సర్పంచు ప్రతినిధి కెప్టెన్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు సారధ్యంలో యువత చేయి చేయి కలిపి సముద్రంలోకి జారిపోయిన గ్రానైట్ బల్లలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేసారు. శుక్రవారం ఉదయం స్థానిక యువకులుతో పాటు పెద్దలు కూడా కర్రలు, తాళ్లు తీసుకువెళ్లి కెరటాలకు కొట్టుకుపోయిన బల్లలను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇదిలా ఉండగా ఎవరిని ఆకర్షించేందుకు ఈ ప్రాంతంలో వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏర్పాటు చేసారో.. అటు వంటి వారి నుండే ఈ బొమ్మలకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి బొమ్మలు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకు తమ వంతు సహకారం అందజేస్తామని కెప్టెన్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు అంటున్నారు.