శ్రీకాకుళం

నిర్విరామ పాటలకు రికార్డులు దాసోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20 : నగరానికి చెందిన చంద్రజ కల్చరల్ అండ్ చారిటీస్ ఆర్గనైజేషన్ వ్యవస్ధాపక అధ్యక్షురాలు మధురగాయిని ఆలపించిన మధుర గీతాలకు రికార్డులు దాసోహమయ్యాయి. స్ధానిక సన్‌రైజ్ హోటల్‌లో సోమవారం ఉదయం 9.30గంటల నుండి 14గంటల సేపు ఆమె నిర్విరామ యుగళ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన ఇప్పటికే ఆమె నిర్విరామ భక్తి సంకీర్తన గానం(సోలోస్)తో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో స్ధానం సంపాదించారు. అదే స్ఫూర్తితో సోమవారం 180 యుగళగీతాలతో ఆధ్యాంతం ఎంతో రసోత్తరంగా కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మరో కొత్త రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30గంటలకు గణపతి ప్రార్ధనతో ప్రారంభమై వానజల్లు గిల్లుతుంటే, సరిగమలు గళగళలు, కురిసింది వాన నా గుండెలోన, తూర్పు సింధూరపు, ఆకుచాటు పిందె తడిచే, ప్రేమయాత్రలకు బృందావనం, నెలవంక తొంగిచూసింది, ఏమో ఏమో ఇది, ఘంటశాల, ఎస్పి బాల సుబ్రహ్మణ్యం సూపర్‌హిట్ యుగళ గీతాలతో నిర్విరామంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ గాయకులు శరత్‌చంద్ర, ఎ ఆర్‌కె రాజు, ప్రముఖ గాయకులు రమణపాత్రో, శాంతమూర్తి, సూర్యప్రకాశ్, కూర్మారావు, గాత్ర సహకారం అందించగా చంద్రజ వారితో కలిసి 180 యుగళ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి వాయిద్య సహకారం బండారు రమణమూర్తి బృందం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్ధ కార్యనిర్వాహక సభ్యులు వి ఎస్ శర్మ, డివి స్వామి, మధు, నరేష్, బి ఎస్ ఎన్ మూర్తి పాల్గొన్నారు.

గ్రామాల్లో బెల్టు షాపులు
* పట్టించుకోని అధికారులు
* వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20 : గ్రామాల్లో బెల్టు షాపులు తొలగిస్తామని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హామి ఇచ్చారని కాని నేడు గ్రామాల్లో బెల్టు షాపులు పెచ్చుమీరి పోతున్నాయని వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపుల తొలగింపు ఫైల్ పై చంద్రబాబు సంతకం చేసారని కాని అదికూడా అన్ని హామీల్లాగే గాలిలో కలిసిపోయిందన్నారు. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో 24మద్యం బెల్టు షాపులు ఉన్నాయని దీనిపై కొరసవాడ కాగువాడ గ్రామాలకు చెందిన మహిళలు పాతపట్నం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా చేసారన్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం బెల్టు షాపులపై దాడులు చేసి పేరుకు ఇద్దరు, ముగ్గురిని అరెస్టు చేసారన్నారు. పాతపట్నం లోని ఆల్ ఆంధ్రా రోడ్డు జంక్షన్ వద్ద షాపు ఉన్నప్పటికి దగ్గరలో గల దుకాణాల్లో మద్యం అమ్మకం విపరీతంగా సాగుతుందని దీనిపై ఎక్సైజ్ వారికి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారడంతో మహిళలు కన్నీరు పాలవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని సోమవారం ఆమె కలెక్టర్‌ను కోరారు.
* 7200 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
మూడు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, గెడ్డలు పొంగి రైతులకు అపార నష్టం వాటిల్లిందని పాతపట్నం నియోజకవర్గం పరిధిలో 7200 ఎకరాలు పంట నీట మునిగిపోయిందన్నారు. అందులో 900 ఎకరాలు పంట తీవ్రంగా నష్టపోయిందని రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేసారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు అధికారులు చొరవ తీసుకొని తగిన నష్టపరిహారం అందించి రాయితీ పై స్వల్పకాలిక విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని ఆమె కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసారు.

డెంగ్యూవ్యాధితో వ్యక్తి మృతి
మందస, ఆగస్టు 20: మండలం నల్లబొడ్లూరుకు చెందిన బి.సోమేశేఖర్(28) గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. ఆదివారం సోమశేఖర్ డెంగ్యూవ్యాధి లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ రక్తకణాలు తగ్గి పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులు బి.తాతారావు, గంగమ్మలు తెలిపారు. గంగమ్మ సీనియన్ టీడీపీ కార్యకర్త కావడంతో ఉద్దానంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతదేహాన్ని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.