శ్రీకాకుళం

36 మంది విద్యార్థినులను రోడ్డున పడవేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), ఆగస్టు 20: బాలికలకు పూర్తిస్థాయి వసతులు కల్పించి విద్యకు సహకరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌డి ఒ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ అధ్యక్షులు శేఖర్, సీపీ ఐ నాయకులు బుడితి అప్పలనాయుడులు మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగానే ఇంటర్ చదువుతున్న బీసీ విద్యార్థినులు స్థానిక ఎస్‌టీ పోస్టుమెట్రిక్ వసతిగృహంలో చేరారన్నారు. అయితే ప్రభుత్వం నూతన విధానాలు ద్వారా వీరికి బిల్లులు చెల్లించకపోవడంతో వసతిగృహం నుంచి బయటకు పంపించివేశారన్నారు. అధికారులకు ఈ విషయాన్ని 15 రోజులుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా కాలేజ్‌లకు వెళుతూ బయట తలదాచుకుంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితికి ప్రభుత్వ విధానాలకు అధికారులే కారణమన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద సుమారు గంటసేపు మండుటెండలో వందలాది మంది విద్యార్థినులు నిరసనలు చేస్తూ ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు బాసటగా నిలిచారు. ఆర్డీవో రెడ్డి గున్నయ్యకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు. పాలకొండలో బీసీ వసతిగృహం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విద్యార్థి నాయకులు ఆర్డీవోను ప్రశ్నించారు. అప్పటివరకు విద్యార్థులు ఉండేందుకు వసతిగృహం చూపించాలన్నారు. పాలకొండలో ఉన్న బీసీ వసతిగృహాన్ని జిల్లాకు తరలించి మళ్లీ ఇక్కడ ఏర్పాటు చేస్తామనడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తుందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించి ప్రజల్లో మనన్నలు పొందండి
పలాస, ఆగస్టు 20: ప్రజల సమస్యలను పరిష్కారించి వారి మనన్నలు పొందాలని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌నాయుడును కలిసి గుడ్‌మార్నింగ్ ఆదివారంలో భాగంగా 18వ వార్డులో గుర్తించిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ పాలకులు, మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రజలు నుంచి వచ్చే సమస్యలను పరిష్కారించేవిధంగా కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండడంతోపాటు సిబ్బందికి గౌరవం కూడ ఉంటుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాకుండా మున్సిపల్ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నప్పటికి సిబ్బంది నిర్లక్ష్యంతో కుళాయిలు ద్వారా బురదనీరు సరఫరా చేస్తున్నారని, ఆ నీరు ప్రజలు తాగినట్లైతే వారి ఆరోగ్యపరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యమంటే మీకు అలుసా అని, ప్రజల ఆరోగ్యం గూర్చి మీరు ఆలోచించి ఉంటే కుళాయిలు ద్వారా బురదనీరు సరఫరా చేసి ఉండేవారు కాదన్నారు. తాగునీరును క్లోరినేషన్ చేసి శుద్దజలాలు ప్రజలకు అందించాల్సిన మున్సిపల్ యంత్రాంగం ఇంతగా నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకు జవాబుదారీతనం ఎవరు అని అన్నారు. 18వ వార్డులో కాలువలు, రహదారులు శిథిలావస్థకు చేరుకుందని, వాటిని మరమ్మతులు చేయాలని కోరారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బల్ల గిరిబాబు, డబ్బీరు భవానీ, బదకల పులిరాజు, బడగల బాలచంద్రుడు, సన్యాసి ఆప్టో, బి.వెంకటరమణ, ఆశోక్, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పురుషోత్తపురంలో విషజ్వరాలు
* వెంటాడుతున్న తెల్లరక్తకణాల లోపం
సరుబుజ్జిలి, ఆగస్టు 20: మండలంలోని వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పురుషోత్తపురం గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఇటీవల కురిసిన వర్షాలు, వంశధార వరద ప్రభావ ప్రాంతమైన ఈ గ్రామంలో ఒక్కసారిగా జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జ్వరపీడితుల్లో తెల్లరక్తకణాల లోపం అధిక శాతం కనిపించడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన పది మంది జ్వర పీడితులు శ్రీకాకుళం ప్రైవేటు ఆసుపత్రి నుంచి చికిత్స పొంది గ్రామానికి చేరుకొన్నారు. ప్రస్తుతం పి.నాగేశ్వరరావు, గొండు అశ్విని, దానేటి పార్వతిలు తెల్లరక్తకణాల లోపంతో విషజ్వరాల బారిన పడి శ్రీకాకుళంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే ఆర్థిక స్తోమత లేని మరికొంతమంది రోగులు కూడా జ్వరాల బారిన పడి స్థానిక ఆర్ ఎంపీ వైద్యులను ఆశ్రయించి గ్రామంలోనే మంచాన పడ్డారు. ఏది ఏమైనా తీవ్రస్థాయిలో మండలంలోని అతి పెద్ద గ్రామమైన పురుషోత్తపురంలో ఒకేసారి జ్వరాలు ప్రబలడం వల్ల గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.