శ్రీకాకుళం

అప్పుల్లో...అబ్కారీ స్టేషన్లు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 20:ఒకప్పుడు రాజకీయనేతలకు..జిల్లాలో జరిగే పెద్దపెద్ద కార్యక్రమాలకు ఫండ్‌రిలీజ్ బ్యాంకులుగా అబ్కారీ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోతున్నాయి! గత ఏడు మాసాలుగా స్టేషన్ల నిర్వహణా నిధులు ఆ శాఖ నుంచి విడుదల కాలేదు. దీంతో స్టేషన్ హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నెలా అబ్కారీశాఖ కమిషనర్ రాజధానిలో సమీక్షలు నిర్వహించడం..ఆ సమయంలో పెద్దమొత్తంలో జిల్లాల డీసీలంతా కలెక్షన్లలో సింహభాగాన్ని సమర్పించి, దీవెనలు అందుకుని మరల జిల్లాల్లో మద్యం దుకాణాలు, బారులపై పడి మామ్మూళ్ళు వసూలు చేసే విధానాన్ని అబ్కారీశాఖ కమిషనర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం నామరూపాలులేకుండా చేసేశారు. అస్టిసెంట్, డిప్యూటీ కమిషనర్ల నుంచి కానిస్టేబుళ్ళ వరకూ మందుకొట్టులతోపాటు, బెల్టుదుకాణాల ద్వారా దందాలు నిర్వహించి రూ. కోట్లకు పడగెత్తినవారు కోకొల్లరు. అటువంటి అబ్కారీశాఖ సాంప్రదాయానికి కమిషనర్ అడ్డుకట్ట వేసిన తర్వాత స్టేషన్ల నిర్వాహణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు స్టేషన్ హౌస్ అధికారులకు దాపురించాయి. దీనిపై రాష్టమ్రంతటా ఎక్సైజ్‌స్టేషన్ల నిర్వాహణకు నెలకు రూ. 10 వేలు చొప్పున్న కమిషనర్ నిధులు విడుదల చేసారు. అంతే - ఎక్కడైనా లంచం పేరు వినిపిస్తే తాటతీస్తానంటూ హెచ్చరికలు ఇవ్వడం ఆరంభించారు. ప్రభుత్వం జీతం ఇస్తుంది. స్టేషన్ నిర్వాహణ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నామంటూ కొత్త పల్లవి కమిషనర్ అందుకున్నారు. కానీ, ఎక్సైజ్ స్టేషన్లల నిర్వాహణకు కూడా నిధులులేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు రూ. లక్షలు మామ్మూళ్ళుకు కేరాఫ్ అడ్రస్సుగా నిలిచే అబ్కారీశాఖ స్టేషన్ హౌస్‌లు ఇప్పుడు అప్పులపాలైపోతున్నాయంటూ నిర్వాహణాధికారులు ఆందోళనపడుతున్నారు. గతంలో మామూళ్ళపై ఆధారపడే స్టేషన్ల నిర్వహణ సాగేది. అబ్కారీశాఖ కమిషనర్‌గా డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వచ్చాక మామ్మూళ్ళకు చెక్ పెట్టారు. లంచాలపై ఉక్కుపాదం మొపడంతో స్టేషన్ల నిర్వహణకు నిధులు ఇప్పించాలని జిల్లాలవారీగా అధికారులు మొరపెట్టుకున్నారు. దానిపై స్పందించిన కమిషనర్ ఎక్సైజ్‌శాఖలో మొట్టమొదటిసారిగా స్టేషన్ హౌస్‌లకు నిధఉలిప్పించే విధానం తీసుకువచ్చారు. జిల్లాలో 14 అబ్కారీ స్టేషన్లకు ఒక్కోక్కదానికి నెలకు రూ. 10,000 చొప్పున్న కొన్ని నెలలు ఇచ్చారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి ఆ నిధులు ఆగిపోయాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో స్టేషన్ల నిర్వాహణ ఇబ్బందిగా మారిందని సీఐలు, ఎస్సైలు గగ్గోలు పెడుతున్నారు. అటు మామ్ముళ్ళ వైపు చూడకుండా, ఇటు ప్రభుత్వం నిధులివ్వకుండా నిర్వహణ ఎలా సాధ్యమని తెగించి ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఫోన్‌చేసి కమిషనర్‌ను అడిగై ధైర్యం లేక, ఉమ్మడిగా అడుగుదామంటే సమావేశాల్లేక డీసీలు గందరగోళంలో ఉన్నారు. ఇక స్టేషన్ల అద్దె వాహనాలు పెట్టేవారూ కరువయ్యారని ఎస్.హెచ్.వో.లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం నెలవారీ రూ. 35 వేలు అలవెన్సుగా ఇచ్చేది. ఆ మొత్తానికి 2500 కిలోమీటర్లు వరకూ తిప్పుతున్నా, ఆ తర్వాత కిలోమీటరుకు కొంత చొప్పున్న సీఐలు కట్టాల్సి వస్తోంది. మూలపడిన పాత వాహనాలు పెడుతున్నారని, కొత్త వాహనాలు పెట్టాలంటే డీజిల్ ఖర్చులు భరించుకోవాలని యాజమాన్యాలు షరత్తులు పెతున్నారని సీఐలు వాపోతున్నారు. ఇటువంటి గందగరగోల పరిస్థితుల్లో గత ఏడాదిగా రాష్ట్ర ఎక్సైజ్‌శాకలో అంతర్గత సమీక్షలు లేవ్! జిల్లా డిప్యూటీ కమిషన్లు ప్రతీ నెలా కమీషనర్ సమీక్షలకు హాజరై అమ్మకాలు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, నాటుసారా వంటి అంశాల నివేదికలు సమర్పించేవారు. వాటి ప్రామాణికంగా తీసుకుని ఏ జిల్లా ఏ స్థానంలో ఉందో సమీక్షించేవారు. అబ్కారీ ఆదాయం తగ్గిన జిల్లాలకు అక్షింతలు వేయడం, బాగా తాగించిన ఎక్సైజ్‌జిల్లా బాసులకు ప్రశంసలు అందించడంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం పరిపాటి. ఎక్సైజ్ కమిషనర్‌గా లక్ష్మీనృసింహం గత ఏడాది ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షలేవ్..కేవలం రెండుసార్లు మాత్రమే జిల్లా డీసీలతో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖ పాలనంతా సర్కులర్లపైనే నడుస్తోంది. దీంతో అబ్కారీశాఖపై మంత్రి పర్యవేక్షణ కూడా తగ్గిపోయేలా కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు జిల్లాకు వెళ్తేగాని మంత్రిని అధికారులు కలిసే అవకాశాలే లేకుండా పోయింది.

జాతీయ లోక్ అదాలత్
విజయవంతం చేయండి
* జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20: జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లాలో గల వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వివిధ ప్రభుత్వ శాఖాధికారులతోసమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులను జిల్లా మొత్తంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ వారు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కక్షి దారులందరికీ ముందస్థుగా చర్చలు జరిపి రాజీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కేసులను గుర్తించి రాజీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. న్యాయసేవా సంస్థల నోడల్ ఆఫీసర్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధరబాబు హాజరై రాజీపడదగిన కేసులు ఎక్కువుగా పరిష్కారం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామలాదేవి, న్యాయాధికారులు గౌతం ప్రసాద్, పద్మామణి, పివి ప్రసాదరావు, ఆర్.శాంతిశ్రీ, ఎల్.దేవీ రత్నకుమారి, లెనిన్ బాబు, శ్రీకాకుళం, పాలకొండ ఆర్‌డీవోలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, డి ఎస్పీ వి.్భమారావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

జీవన ప్రమాణాలు మెరుగుపరిచే శిక్షణ అవసరం
* కలెక్టర్ ధనంజయరెడ్డి
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 20: జీవన ప్రమాణాలను మెరుగుపర్చే శిక్షణలను అందించాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో మెప్మా ద్వారా స్వయం శక్తి సంఘాలకు అందించే శిక్షణా కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలకు ఆవశ్యకమైన ఈవెంట్ డెకరేషన్, టెర్రేస్ గార్డెనింగ్ వంటి శిక్షణాకార్యక్రమాలను అందించాలని సూచించారు. గృహాలలో అత్యవసర సర్వీసులను అందించడానికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి నిపుణులతో కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని చెప్పారు. తద్వారా ఇటు శిక్షణపొందిన వారికి ఉపాథి కలుగుతుందని ప్రజలు అత్యవసర సర్వీసులను తక్షణమే పొందే అవకాశం కలుగుతుందన్నారు. మెప్మాపీడీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ 6 మున్సిపాల్టీల పరిథిలో 2018-19 సంవత్సరంలో 24 రకాల కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ మంచి ఉపాధినిచ్చే కార్యక్రమాలపై శిక్షణ అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి డి ఆర్‌డి ఏ పీడీ జిసీ కిషోర్‌కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ గోపాల క్రిష్ణ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పోరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, తదితరులు హాజరయినారు.