శ్రీకాకుళం

ప్రతిపక్ష నేతల అరెస్టు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 24: రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించి సమస్యల పరిష్కారానికై ఉద్యమిస్తే, ప్రభుత్వం స్పందించాల్సింది పోయి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం శోచనీయమని డిసిసి అధ్యక్షుడు డోల జగన్మోహనరావు పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలు, అమరావతి నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర అనుమతులు లేకుండా తెలంగాణా రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో ప్రోజెక్టులు నిర్మిస్తుంటే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రదాన కార్యదర్శి చౌదరి సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తిలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుకు నోటు కేసు తీస్తున్నారని, అందుకు భయపడి బాబు రాష్ట్రాన్ని పణంగా పెట్టి మిన్నకుంటున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఎపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి దీక్షలు చేపట్టి ఉద్యమిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో పోలీసులచే అరెస్టు చేయించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉందని, రాష్ట్ర ప్రయోజనాలకై కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అరెస్టులకు బెదిరేది లేదని స్పష్టం చేసారు. సమావేశంలో నంబాళ్ల రాజశేఖర్, బాణ్ణ రాము, బి.నారాయణమూర్తి, కొంక్యాణ మురళీధర్, కె.యల్.ఈశ్వరి, బి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.