క్రైమ్/లీగల్

వీఆర్వో అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, సెప్టెంబర్ 18: మండలంలోని లుకలాం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ముద్దాడ నర్శింగరావు(59) అనుమానస్పధంగా మృతి చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని ముసిడిగట్టు పంచాయతీ ఉప్పరపేట గ్రామం వద్ద జీడి మామిడి తోటలో అనుమానస్పదంగా నర్శింగరావు మృతదేహాన్ని గ్రామస్థులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో నిశితంగా పోలీస్ అధికారులు పరిసరాలను పర్యవేక్షించారు. ఈ దిశగా పురుగుల మందు సంఘటనా స్థలానికి 30 అడుగుల దూరంలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే విష పదార్థం తీసుకున్న వ్యక్తి మరణించినట్లుగా లేదని అక్కడవున్న పరిసరాలను బట్టి స్పష్టంగా తెలుస్తొందని స్థానికులు పోలీసులకు వివరించారు. ఇటీవల మండలంలో మృతిచెందిన నర్శింగరావుకు సుమారు 12 పంచాయతీల్లో వీ ఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతోనే ఎవరైనా ఆయన హత్యకు పాల్పడే అవకాశాలు కన్పిస్తున్నాయని బంధువులు ఆరోపించారు. ఈ దిశగానే చేనెలవలస బుచ్చిపేట వద్ద ప్రభుత్వం ఇసుక ర్యాంపులను కేటాయించగా వాటి రహదారి నిర్మాణాలపై స్థానికులు ప్రతిఘటించిన సంఘటనలు చోటుచేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవాది వద్ద రెండు లారీలు, ఒక జేసీబీని పట్టుకొని నర్శింగరావు అధికారులకు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలోనే హత్య యత్నం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని మృతుని సోదరులు రామ్మోహనరావు, సింహాచలం, భార్య సుశీల, కుమార్తెలు సమీర, శ్రవంతి, కుమారుడు కిరణ్‌కుమార్ పోలీసులకు తమ గోడును వినిపించుకున్నారు. అయితే సంఘటనా స్థలం వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలు కన్పించకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తుంది. అంతేకాకుండా మృతుని ద్విచక్ర వాహనంలో తన చేతి గడియారం, ఉంగరాన్ని డిక్కీలో భద్రపరిచి తాను పని ఒత్తిడికి లోనవుతున్నానని, తనను విధుల నుండి తప్పించాలని ఈనెల 16వ తేదీన రాసిన లేఖను డిక్కీనుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏ ఎస్సై టి.పనసారెడ్డి, డీ ఎస్పీ భీమారావు, సి ఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై జి.నారాయణస్వామి, ఆర్డీవో ఎమ్‌వి రమణ, తహశీల్దార్ జల్లురామారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.