శ్రీకాకుళం

సముద్ర తీర ప్రాంతం వారు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, సెప్టెంబర్ 21: మండలంలోగల రాజారాంపురం, గుప్పిడిపేట, రేవుఅంపలాం, కొవిరిపేట, వాటితోపాటు మరికొన్ని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ జెన్నిరామారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగల 24 గంటల్లో తుఫాన్ హెచ్చరికలు ఉన్న కారణంగా మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఆయన అన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల ఎటువంటి సమస్యలు ఉండరకూడదని, ఎప్పుడు ఏ అవరసమున్నా మా సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన అన్నారు. వచ్చినటువంటి సమస్యలపై స్పందించాలని తక్షణమే స్పందిస్తామని ఆయన తెలిపారు. వీటికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు త్రినాధరావు, ఢిల్లీశ్వరరావు, మత్స్యకారులు పాల్గొన్నారు.
వరి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి
పోలాకి, సెప్టెంబర్ 21: మండలంలోగల గొల్లలవలస గ్రామంలో రైతులు వరి పంటలను పరిశీలిస్తున్నామని మండల వ్యవసాయాధికారి సి.హెచ్.కె వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి రైతుల పొలానికి వెళ్లి వరిచేనును పరిశీలించారు. సాంబ రకానికి తెల్లదోమ, అగ్గితెగులు వ్యాపించినట్లు ఆయన తెలిపారు. స్వర్ణరకానికి పాముపొడ తెగులు, మావుతెగులు ఉన్నట్లు గుర్తించారు. మరికొన్ని రకాలను కూడా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. వీటికి సంబంధించి సాంబ రకానికి ఎకరాకి ట్రైట్రైక్లోజోల్ 120 గ్రాములు పురుగుమందు, ఎకరాకి మోనోక్రోటోఫాస్ పావులీటరు చొప్పున పిచ్‌కారీ చేయాలని ఆయన అన్నారు. అలాగే స్వర్ణరకానికి సంబంధించి వాలిడామైసిన్ పావులీటరు, పురుగుమందు మోనోక్రోటోఫాస్ కలిపి పిచ్‌కారీ చేయాలని ఆయన అన్నారు. అలాగే మరికొన్ని రకాల చేనుకు ఆయా సంబంధిత పురుగుమందులు ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వరిలో ఎటువంటి సమస్యలు ఉన్నా రైతులు వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. తక్షణమే మీమీ పొలాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.