శ్రీకాకుళం

ఉద్దానాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, సెప్టెంబర్ 21: ఉద్దానాన్ని ప్రభుత్వం ఆదుకొని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని దేశభక్తిప్రజాతంత్ర ఉద్యమం అధ్యక్షులు జె.వెంకటరావు అన్నారు. శుక్రవారం బొడ్డపాడు గ్రామంలో పిడి ఎం జిల్లా 2వ మహాసభలను నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 కేజీల జీడిపిక్కల బస్తాకు 17 వేల రూపాయలు చెల్లించాలని, జీడి, మామిడి, కొబ్బరి, పసనలు నష్టపోయిన రైతులకు ఇతోధికంగా మందులను అందజేయాలన్నారు. కిడ్నీ వ్యాధికి గల మూలాలను కనుగొనాలని, కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు, పింఛన్లును అందజేయాలన్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె.బీమారావు, ప్రధానకార్యదర్శి ఎస్.వీరాస్వామి, కోశాధికారి ధనరాజ్, దుర్యోదన, దాలినాయుడు, బాలరాజు, వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, ఆర్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి అభివృద్ధికి నిధులు వెచ్చించండి
పలాస, సెప్టెంబర్ 21: పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించాలని పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అన్నారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఈ రెండేళ్లులో గణనీయంగా అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధికి ఆసుపత్రికి మంజూరైన నిధులు పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు. ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను పూర్తిస్తాయిలో కొనుగోలు చేయాలని, కిడ్నీ వ్యాధి పరీక్షలకు పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. వైద్యులు రోగులకు నిత్యం అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని కోరారు. అంతకుముందు ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ సునీల మృతి చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సమావేశంలో డాక్టర్లు ప్రకాశ్‌వర్మ, స్వరాజ్యలక్ష్మి, పలాస మున్సిపల్ కమిషనర్ రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిదీ రాజకీయకోణంలో చూడడం తగదు
పలాస, సెప్టెంబర్ 21: ప్రతి విషయాన్ని రాజకీయకోణంలో చూసి రాజకీయతగాదాలు పెట్టడం సరైన పద్దతి కాదని పలాస వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు తెలుసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్, పలాస ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జి.సూర్యనారాయణలు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇరుకుటుంబాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాడులపైన వైసీపీ నాయకుడు అప్పలరాజు రాజకీయం చేస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇరుకుటుంబాలు ఘర్షణ పడి గాయాలతో ఆసుపత్రి పాలైతే, అక్కడకు వైసీపీ నాయకులు చేరుకొని అధికార పార్టీ నాయకుల ప్రేరణతో ఈ దాడి జరిగిందా అని ప్రశ్నించి వారితో ఏదో విధంగా నాయకుల పేర్లు చెప్పించడానికి సీదిరి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు. ఆ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయని, దానిని రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దిగజారుడు రాజకీయాలు అని, అటువంటి రాజకీయాలు చేయడం సీదిరికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. రాజకీయ ఉనికి కోసం ఇంతగా దిగజారిపోతారని, సీదిరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లులో ప్రతిదీ రాజకీయం చేసి చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుటిల రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణమూర్తి, నిమ్మాన భైరాగి, రవిశంకర్‌గుప్తా, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారంలో ఇంత నిర్లక్ష్యమా
అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే
రాజాం, సెప్టెంబర్ 21: రాజాం నగర పంచాయతీ అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 8వ వార్డు పరిధిలోని చిన్న చెరువు గట్టు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వార్డుదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ ప్రాంత సమస్యలపై తీవ్రంగా స్పందించారు. మరుగుదొడ్లు నిర్మించి నెలలు కావస్తున్నా ఇంతవరకు వినియోగంలోకి తేకపోవడంలో అర్థం ఏమిటని, అలాగే పారిశుద్ధ్యం ఇతర సమస్యల పరిష్కారంలో కూడా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాలువ నిర్మాణం, కల్వర్టు నిర్మాణం వంటివి చేపట్టాలని ఆయన కోరారు. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పందుల దొడ్లును దగ్గరుండి తొలగింపచేశారు. ఆయనతో పాటు పారంకోటి సుధాకర్, దూబ గోపాలం, కె.సుదర్శనరావు, విజయకుమార్, పాలవలస శ్రీనివాసరావు, మజ్జి రమణ తదితరులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు ఏపీటీ ఎఫ్ సన్మానం
రాజాం, సెప్టెంబర్ 21: రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాధంకు ఇటీవల గురజాడ సాహిత్య అవార్డు లభించడంతో ఏపీటీ ఎఫ్ మండల శాఖ ఆయనను ఘనంగా సత్కరించింది. రచయితల వేదిక నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రంగనాధంకు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని ఏపీటీ ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మజ్జి మదన్‌మోహన్, వారాడ వంశీకృష్ణ, పిల్లా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్నకు వర్షం దెబ్బ
రాజాం, సెప్టెంబర్ 21: రాజాం మండలంలో విస్తారంగా వేసుకున్న మొక్కజొన్నకు మూడు రోజుల నుంచి గాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న చేను చాపలా పడిపోవడంతో రైతులు దిగాలు చెందారు. చేతికందికొచ్చిన పంట నేలపాలై మొలకలు మెలుస్తున్నాయని, దీంతో నాణ్యత దెబ్బతింటుందని, ఇప్పటికే పంటకోసిన రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై వ్యవసాయాధికారులు స్పందించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని రైతు సంఘం ప్రతినిధులు పల్లి రాము తదితరులు డిమాండ్ చేశారు.
నందబలగలో కావాలి జగన్... రావాలి జగన్
రాజాం, సెప్టెంబర్ 21: మండలంలోని నందబలగలో కావాలి జగన్...రావాలి జగన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంబాల జోగులు సారధ్యంలో నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధులను సందర్శించి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. వై ఎస్సార్ ఆశయ సాధనకు జగన్ వల్లనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మండల నాయకులు పాలవలస శ్రీనివాసరావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు
అభ్యుదయ జాడ గురజాడ
సరుబుజ్జిలి, సెప్టెంబర్ 21: సంఘ శ్రేయస్సే ధ్యేయంగా ఆజన్మాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అని గురజాడ ఫౌండేషన్ సమన్వయకర్త మందపల్లి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం గురజాడ జయంతి ఉత్సవాలను వీరమల్లిపేట గ్రామంలో జై హనుమాన్ నాయుడు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనపాల సతీష్, దాసరి సురేష్, బాలకృష్ణ, ఉంగరాల వనిత, రమాదేవి, భూదేవి, గాయత్రీ, పద్మ, అలైఖ్య తదితరులు పాల్గొన్నారు.
దేశమంటే మట్టికాదోయ్...
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 21: దేశమంటే మట్టికాదోయ్..మనుషులోయ్ అనే భావజాలాలను తెలుగు ప్రజల గుండెల్లో నాటి రోజుల్లోనే తట్టిలేపిన అభ్యుదయ వ్యక్తి గురజాడ అప్పారావు అని తెలుగు పండితులు బౌరోతు శంకరరావు అన్నారు. గురజాడ జయంతి ఉత్సవాలను సూర్యచంద్ర కళాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ర్తిజాతికి కన్యాశుల్యం రాసి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అటువంటి మేథావులు పుట్టిన దేశంలో యువత ప్రస్తుతం నిర్వీర్యమవుతున్న పరిస్థితులను ఆయన వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి సంఘ సంస్కర్తగా మారకపోయినా సేవా గుణం కలిగి తోటివారికి హాని చేయకుండా జీవిస్తే ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి పరిణామాలు ఇవ్వాలంటే ప్రస్తుతం యువత సామాజిక సేవా రంగాల్లో ముందు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మాష్టార్ జనార్థనరావు తదితరులున్నారు.
అక్కరకు రాని మరుగుదొడ్లు
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళల ఇక్కట్లు
అసాంఘిక కార్యకలాపాలపై ఆరోపణలు
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 21: ప్రయాణికుల సౌకర్యం కోసం లక్షలాది రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని మరుగుదొడ్లు ఎటువంటి వినియోగాన్ని అందించడం లేదు. దీంతో మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. వినియోగానికి నీరు లేకపోవడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లడం లేదు. దీంతో కొంతమంది ఆకతాయిలు ఈ గదులను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన గదులు కావడం, ఇప్పటివరకు వినియోగంలో లేకపోవడంతో ఇవి పరిశుభ్రంగానే లోపల భాగం కనిపిస్తోంది. తలుపులు కూడా అమర్చి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను గుర్తించిన కొంతమంది వేరే విధంగా వినియోగిస్తున్నట్టు వినికిడి. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏజెన్సీ మైదాన ప్రాంతానికి సంబంధించి ప్రతినిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణాలు జరుగుతుంటాయి. అలాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండడం లేదు. ప్రయాణికుల శ్రేయస్సు కోసమే తపిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. మరుగుదొడ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వినియోగంలోకి తేకపోవడం దీనికి తార్కాణంగా నిలుస్తుంది.
నవయుగ వైతాళికుడు గురజాడ
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 21: కులమతాలు లేని సమాజం రావాలి. నాటి సాంఘిక దురాచారాలపై అక్షర అస్త్రాలు సంధించి తెలుగుజాతి గర్వించదగ్గ వైతాళుకుడు గురజాడ అని పలువురు వక్తలు కొనియాడారు. నవయుగ వైతాళికుడు గురజాడ వెంకటప్పారావు 156వ జయంతిని స్థానిక శాంతినికేతన్ కళాశాలలో తెలుగురచయితల వేదిక శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆధునిక సమాజానికి గురజాడ రచనలు దారి చూపే దీపం లాంటివని ఆయన స్ఫూర్తితో కొత్తతరం ప్రయాణించి సామాజిక రుగ్మతలను అరికట్టడంలో కృషి చేయాలని కోరారు. తెలుగులో తొలి కథానిక ‘దిద్దుబాబు’ ఆయన కలం నుండి జాలువారిందని కన్యాశుల్కం నాటకంతో సుప్రసిద్ధులయ్యారని, కన్యక, పూర్ణమ్మ లాంటి రచనలతో నాటి సామాజిక పరిస్థితులను వెలుగులోనికి తెచ్చామన్నారు. ఉత్తరాంధ్ర నేలపై వెలుగుజాడ గురజాడ అని ప్రశంశించారు. దేవుల్లారా మీ పేరేంటి..? అన్న కథ వందేళ్ల తెలుగు కథలో గొప్ప కథగా పేరొందిందని గుర్తుచేసుకున్నారు. భావితరానికి ఆయన ఒక స్ఫూర్తి అని పేర్కొన్నారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఐ ఎన్‌డి ప్రసాద్, డాక్టర్ పి.జగదీష్, దాసిరెడ్డి చిరంజీవి, సంస్థ సాంస్కృతిక కార్యదర్శి గజల్ వాసుదేవాచారి, శాంతినికేతన్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ అప్పలరాజు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల తనిఖీ నిర్వహంచిన ఏడి
జలుమూరు, సెప్టెంబర్ 21: మండలం చల్లవానిపేట కూడలిలో ఉన్న పలు ఎరువుల దుకాణాలను సోంపేట వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి.వెంకటేశ్వరరావు శుక్రవారం ముమ్మర తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి విక్రయాలు జరిపినా అనుమతి లేని అమ్మకాలు చేసినా చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల అమ్మకాల పై ఎటువంటి అనుమతి లేని సరుకులను అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు జలుమూరు ఇన్‌ఛార్జ్ వ్యవసాయాధికారి చిన్న వెంకటరావు, ఎంపీ ఈవో, పిటి ఎమ్ పాగోటి రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు.
మానసిక ప్రశాంతకే ఆధ్యాత్మిక చింతన అ