క్రైమ్/లీగల్

విషజ్వరం లక్షణాలతో మహిళ మృతి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, అక్టోబర్ 3: రాజాం నగర పంచాయతీ సారధి గ్రామానికి చెందిన గెడ్డాపు నీలవేణి (32) అనే మహిళ విషజ్వర లక్షణాలతో బుధవారం ఉదయం శ్రీకాకుళంలో కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజాం బస్టాండ్ ప్రాంతంలో భర్త రామకృష్ణతో పళ్ల బండి నడుపుతూ జీవనం సాగించేంది. మృతి చెందిన నీలవేణికి రెండేళ్ల పాప కూడా ఉంది. పేద ఎస్సీ కుటుంబానికి చెందిన వీరికి చంద్రన్న బీమాతో ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
శిథిలమైన మార్చురీ గది తొలగింపునకు చర్యలు
వీరఘట్టం, అక్టోబర్ 3: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న పూర్తిస్థాయిలో శిథిలమైన మార్చురీ రూమ్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షులు జమి లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఇటీవల హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇంజనీరింగ్ అధికారులకు విన్నవించి శిథిలమైన మార్చురీ రూమ్‌ను తొలగించాలని కోరారు. అయితే బుధవారం సంబంధిత అధికారులు, పీహెచ్‌సీ వైద్యాధికారి విశేష్‌కుమార్ భవనాన్ని పరిశీలించి తొలగించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి పంపిస్తామన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
* మరమ్మతులకు గురైన భవనాలకు నిధులు మంజూరు...
పీహెచ్‌సీకి ఆనుకొని ఉన్న పాత భవనం మరమ్మతులకు గురికావడంతో సుమారు రూ.5 లక్షలు నిధులు మంజూరైనట్టు వైద్యాధికారి విశేష్‌కుమార్ తెలిపారు. త్వరలో టెండర్లు వేసి మరమ్మతులు చేపడతామన్నారు.