క్రైమ్/లీగల్

అనుమానస్పదరీతిలో అంబుసోలివాసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 9: కాశీబుగ్గ ఎల్‌సీగేటు సమీపంలో రాళ్లు, తుప్పల మధ్య అంబుసోలికి చెందిన ఎం. ఆనంద్(43) అనుమానస్పదరీతిలో మృతి చెందడం కలకలం రేపింది. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు ఆనంద్ స్థానిక హోటల్‌లో పనిచేసేవాడని, అతి మద్యం సేవించేవాడని, సోమవారం రాత్రి విధులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునన్నారు. మృతుడు శరీరంపై దుస్తులు లేకపోవడం పట్ల బహిర్బుమికి వెళ్లి మద్యం మత్తులో సొమ్మసిల్లి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ సి ఐ ఆశోక్‌కుమార్ తెలిపారు.