శ్రీకాకుళం

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 12: తిత్లీ తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగానికి సమగ్రమైన, శాస్ర్తియమైన నష్టపరిహారం చెల్లించాలని రైతుకూళీ సంఘం ( ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. 2104లో వచ్చిన హుదూద్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టం పూర్తిగా రైతాంగానికి నేటి వరకు అందలేదని అన్నారు. తుఫాన్‌లు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల పర్యటనలు, అదికారుల హడావిడి తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ప్రతీ మండలాన్ని, ఆమండలంలో ఉన్న గ్రామాలను యూనిట్‌గా తీసుకొని సమగ్రమైన దర్యాప్తు జరిపించి నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. చనిపోయిన ప్రతీ కుటుంబానికి రూ.20లక్షలు, వరి, అరటి, చెరకు, పత్తి, బొప్పాయి తదితర పంటలకు ఎకరాకు రూ.25వేలు, కొబ్బరి, జీడిమామిడి పంటలకు రూ.50వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతాలలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించి వలలకు, బోటులకు జరిగిన నష్టాన్ని అంచనావేసి పరిహారం అందజేయాలని కోరారు. తక్షణం ప్రతీ కుటుంబానికి 50కేజీల బియ్యాన్ని అందించాలన్నారు. కూలిన పశువుల పాకలు, షెడ్డులు, ఇళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ, జిల్లా అధ్యక్షుడు పి.పోలారావులు డిమాండ్ చేశారు.

ఘనంగా కుంకుమ పూజలు
పోలాకి, అక్టోబర్ 12: మండలంలో గల తలసముద్రం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు దోర్లపూడి భాస్కరశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏట ఈ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా గ్రామస్థులు నిర్వహిస్తూ ఉంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది యధాప్రకారం పూజలు నిర్వహించి ఈ సందర్భంగా శుక్రవారం నాడు 118 మంది మహిళలచే ప్రత్యేక కుంకుమపూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రతీ నిత్యం నవరాత్రులు పూర్తయ్యేవరకు భవాని మాలలు ధరించిన భవానీలు నిత్యపూజలు యధావిధిగా జరుపుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీలు కేశవభవాని, శేఖర భవాని, ఈశ్వర భవానీతో పాటు మరికొందరు భవానీలు పూజల్లో పాల్గొన్నారు.

..........