శ్రీకాకుళం

తుఫాన్ ప్రభావం వలన పూరిళ్లు, గోడ శిథిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, అక్టోబర్ 12: మండలంలో గల తలసముద్రం గ్రామంలో తిత్లీ తుఫాన్ వలన బలమైన గాలులు, వర్షం వలన గ్రామంలో ఉన్నటువంటి బొబ్డాడి గురుమూర్తి అనే వ్యక్తియొక్క పూరిళ్లు, గోడ శిథిలమయినట్లు విలేఖరులకు తెలిపారు. అ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ స్వతంత్రంగా డాబా ఇళ్లు కట్లేందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నానని అందవలనే ఇళ్లు కట్లుకోలేకపోయానని ఆయన తెలిపారు. ఎలాగోలా జీవనం గడుతున్నానని ఆయన తెలిపారు. కొద్ది నెలల క్రితమే భార్య అనారోగ్యంతో మరణించినట్లు తెలిపారు. నాకు ఇద్దరు ఆడపిల్లలని, వారిద్దరికి పెళ్లి చేయడం వలన ఆర్థికంగా వెనుకబడి ఉన్నానని, కుమారుడు చదువుతున్నాడని తెలిపారు. విధిలేని పరిస్థితిలో జీవనం సాగిస్తున్న సమయంలో ఈ తుఫాన్ వలన వున్న గూడును కూడా కోల్పోయామని ఆయన తెలిపారు. ప్రభుత్వం వారు సహకరిస్తే తుఫాన్ ప్రభావం వలన ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయం కింద ఇళ్లును శాంక్షన్ చేస్తే కట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

వంశధార నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పోలాకి, అక్టోబర్ 12: మండంలో గల వనిత మండలం, జొన్నాం, డోల, పల్లిపేట గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వంశధార నదీ ప్రవాహం అధికంగా ఉండడం వలన ఏ సమయంలోనైనా గ్రామాలను ముంచే అవకాశం ఉందని మండల తహశీల్దార్ జెన్నిరామారావు తెలిపారు. ఇప్పటికే పల్లిపేట గ్రామస్థులను పోలాకికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనిత మండలం దగ్గర వంశధార నదీ ప్రవాహాన్ని పరిశీలించామని , వీటికి సంబంధించిన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నీటి ప్రవాహంలో ఎటువంటి వస్తువులు వచ్చినా, కర్రలు వచ్చినా వాటికి ఆశపడి ఏ ఒక్కరూ నదిలో దిగే సాహసం చేయవద్దని ఆయన హితవుపలికారు. వీటికి సంబంధించి మాయొక్క సిబ్బంది ఆర్ ఐలు ఢిల్లీశ్వరరావు, త్రినాధరావు, వీ ఆర్వోలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాగల 24 గంటల వరకు మాయొక్క సిబ్బంది ఆయా గ్రామాలలో పర్యటిస్తారని ఆయన తెలిపారు.