శ్రీకాకుళం

విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 12: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలం బోర్డ్ మెంబర్, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్ ఆర్ కోటీశ్వరరావు అన్నారు. మండలంలోని నైర వ్యవసాయ కళాశాలలో శుక్రవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలన్నారు. క్రీడలు శరీర ధారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డ్ మెంబర్ చాపర గణపతిరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న వాటిపై వివరించారు. వీటి ప్రాముఖ్యతను కూడా విద్యార్థులు రైతులకు తెలియజేయాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ విపి కృష్ణయ్య మాట్లాడుతూ అంతర్ కళాశాల క్రీడా పోటీలు నైరలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇక్కడ విశాలమైన గ్రౌండ్ ఉందని తెలియజేశారు. క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చాలన్నారు. క్రీడలతో పాటు విద్యలో కూడా ముందంజలో ఉండి వ్యవసాయ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎ డాక్టర్ సుధాకర్, వార్డెన్ ఉపేంద్రరావు, డాక్టర్ పి.సీతారాం, కుసుమ, ప్రత్యూష, కిరణ్మయ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.