శ్రీకాకుళం

వరద పీడిత ప్రాంతాలపై సమగ్ర నివేదిక అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, అక్టోబర్ 14: మండలం వంశధార నదీతీర గ్రామాలైన శ్రీముఖలింగం, నగరికటకం, అత్యుతాపురం, మర్రివలస, కొమనాపల్లి, సురవరం, సవరిగాం పలు గ్రామాలను ఐ ఏ ఎస్ అధికారి చెంతూరు ఐటిడి ఏ పీవో ఎమ్‌వి కిషోర్ అన్నారు. పై గ్రామాలలో ఆదివారం సుడిగాలి పర్యటన జరిపారు. ముఖలింగం గ్రామాన్ని సందర్శించిన వెంటనే మధుకేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్ని గ్రామాలలో పంట పొలాల నష్టం, రహదారులు, ఇతర నష్టాలపై సమగ్రమం పరిశీలించి ఈ నివేదికను జిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి అందజేస్తామని కిషోర్ అన్నారు. కొమనాపల్లి వద్ద ఇప్పటికే నీటిలో మునిగిన పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో చర్చించారు. ఇటువంటి పరిస్థితులపై ప్రభుత్వం సహకరించినా ప్రజలు ధైర్యంగా ఉండవలసిన సమయమని, ఈ విపత్తులను అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఎంపీడీవోపడాల వాసుదేవరావు, తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ, మండల విద్యాశాఖాధికారి బమ్మిడి మాధవరావు, ఆర్ డబ్ల్యు ఎస్ జే ఈ నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా మెలగాలి:
ప్రస్తుతం ఏర్పడిన తుఫాన్ వలన అనేక గ్రామాలు పలు విధాలైన నష్టాలను ఎదుర్కొంటున్నారని, వీరికి అన్ని విధాల ఆదుకోవల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని కిషోర్ అన్నారు. ఆదివారం సాయంత్రం జలుమూరు తహశీల్దార్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వరద ప్రాంతాలలో తాగునీటి సరఫరా, అంటువ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు, గ్రామాలలో విద్యుత్ సరఫరా, పశువైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం తుఫాన్ వలన గోడకూలినవి, ఎటువంటి నష్టాలు సంభవించినా సమగ్ర నివేదిక తయారుచేయవల్సిన బాధ్యత అధికారులపై వుందని ఆయన అన్నారు.

వరద బాధితులను ఆదుకుంటాం
* ఎమ్మెల్యే రమణమూర్తి
జలుమూరు, అక్టోబర్ 14: గతంలో ఎన్నడూలేని విధంగా కేవలం శ్రీకాకుళం జిల్లాకే తుఫాన్ ప్రభావం ప్రకృతి చూపిందని, అన్ని విధాల తుఫాన్ ప్రభావిత గ్రామాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం మండలం మర్రివలస, కొమనాపల్లి, అత్యుతాపురం, శ్రీముఖలింగం గ్రామాలను స్వయంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమై ప్రకృతి వలన కల్గే నష్టం, ఇతర పంట నష్టం, ఇతర విషయాలను అడిగి తెల్సుకున్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు జిల్లాకు చేరుకొని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు అన్ని విధాల ఆదుకోవడం జరిగిందని, తమ ప్రభుత్వం ప్రజల కష్ట సుఖాలలో ముందుగా ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి వారికి అండగా నిలిచే ప్రభుత్వం మాదేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికావల్సిన పనిలేదని బరోసా ఇచ్చారు. ఆయనతో పాటు తహశీల్ధార్ కె.ప్రవళ్లిక ప్రియ, రెవెన్యూ సిబ్బంది, ఇతర సిబ్బంది, దేశం నేతలు వెలమల చంద్రభూషణ, బగ్గు గోవిందరావు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, పొన్నాడ బాలయ్య, తర్రా బలరాం, బి.ప్రసాదరావు, కనుసు రవి పలువురు పాల్గొన్నారు.