శ్రీకాకుళం

దేశం పట్ల నిబద్ధత గల నేత నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 27: దేశం పట్ల నిబద్ధత కలిగి, దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం కాపాడిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని డిసిసి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, భావజాలంతోనే ఛాయ్ వాలా దేశ ప్రధాని కాగలిగారని నరేంద్రమోదిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించడం నెహ్రూ చలవే అన్నారు. దేశం కోసం ఆస్తులే కాదు నెహ్రూ కుటుంబం యావత్తూ ప్రాణత్యాగం చేసిందని గుర్తుచేశారు. నేటి నెహ్రూ కుటుంబ వారసురాలు సోనియాగాంధీ వరకు సాధారణ పౌర జీవనం సాగించడం వారికి దేశం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్తేమీ కాదని, అయితే ఏనాడూ సిద్ధాంతాలను విస్మరించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అంటూ, ఎల్లప్పుడూ సమసమాజ స్థాపనకు కట్టుబడ్డ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎపిసిసి అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి, గంజి ఆర్.ఎజ్రా, ఎం.ఎ.బేగ్, కె.ఎల్.ఈశ్వరి పాల్గొన్నారు.