శ్రీకాకుళం

గ్రామ దర్శినిలో గ్రామాభివృద్ధి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, నవంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న పలు పథకాలపై గ్రామ ప్రత్యేకాధికారి టి.హెచ్. ఎస్‌వి కె ప్రసాదరావు తెలిపారు. గురువారం మండలం మదుపాం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవోపి ఆర్‌డి కె.కృష్ణారావు మాట్లాడుతు ప్రభుత్వం గడిచిన నాలుగన్నరేళ్లలో అమలు చేసి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఇంకా గ్రామంలో 2019-20 సంవత్సరంలో గ్రామానికి, ప్రజలకు కావలసిన పనులు సిపిడిపి ద్వారా అభివృద్ధి ప్రణాళికలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి కాల్వల మరామత్తు చేపట్టేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అర్హులైన 150 మందికి పింఛన్లు, 154 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, 23మందికి ఎన్టీ ఆర్ హౌసింగ్ నిర్మాణాలు, 378 మందికి రేషన్ కార్డు దారులకు నిత్యవసర సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. వ్యవసాయశాఖ ఏ ఈవో దొర మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీపై రైతులకు వేరుశనగ, మినుమలు, మొక్కజొన్న, పెసర విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా ప్రభుత్వ పథకాలపై కళాబృందం బుర్రకథ దళం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈవో ఎ.రవి, ఆర్ ఐ రాజారమేష్, ఏటీవో పురుషోత్తమరావు, వీఆర్‌వో ముద్దాడ నీలకంఠం, కార్యదర్శి డి.రమణయ్య, వర్క్ ఇనిస్పెక్టర్ నక్క శ్రీనుతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఏ ఎన్ ఎంలు, డ్వాక్రాసంఘ మహిళలు పాల్గొన్నారు.

ఆత్మహత్యలే శరణ్యం
* స్పఫ్టం చేసిన కూర్మనాధ ప్రజలు
సారవకోట, నవంబర్ 8: తిత్లీ తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయిన తమకు పరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని జీవనోపాధి కోల్పోయిన తమకు ఆత్మహత్యలే శరణ్యమని మండంలోని కూర్మనాధపురం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయానికి గురువారం తరలివచ్చిన వీరు మాజీ సర్పంచ్ బొడ్డేపల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో ఎంపీపీ కూర్మినాయుడుకు వినతిపత్రం సమర్శించి తమ గోడును వినిపించారు. టెక్కలి పట్టణానికి సమీపంలో ఉన్న తమ గ్రామం తుఫాన్ అనంతరం మూడు రోజుల పాటు బాహ్యప్రపంచానికి సంబంధాలు లేకుండా ఉందని, ప్రతీ కుటుంబానికి చెందిన చెట్లు పెద్ద ఎత్తున నేలకూలాయన్నారు. ఉద్యానవన శాఖాధికారులు ప్రాథమికంగా రూపొందించిన నివేదికలు ఆధారంగా తమ గ్రామానికి చెందిన 126 మంది రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించవలసి ఉండగా కేవలం 50 మంది రైతులకే పరిహారం అందించారని వివరించారు. అదేవిధంగా గ్రామంలో పెద్ద ఎత్తున పశువుల శాలలు కూలిపోయినప్పటికి ఒక్కరికి కూడా పరిహారం మంజూరి చేయకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లమయిందన్నారు. ఇప్పటికైనా జియో ట్యిగింగ్ నిబంధనను సడలించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా కృషి చేయాలని ఎంపీపీ కూర్మినాయుడును వేడుకున్నారు. ఈ విషయమై ఎంపిపి కూర్మినాయుడు మాట్లాడుతూ అధికారుల తప్పిదాల వలన సాంకేతిక పరమైన లోపాల వలన కూర్మనాధపురం ప్రజలకు నష్టపరిహారం మంజూరు చేయని పక్షంలో వెంటనే సవరించుకొని పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. అదేవిధంగా మధనాపురం, సవరబెజ్జి గ్రామాలకు చెందిన బాధితులకు కూడా న్యాయం చేయాలని ఆయన కోరారు.

కార్తీకపురాణం ప్రవచనం ప్రారంభం
జి.సిగడాం, నవంబర్ 8: మాసంలోకార్తీకమాసం అతి పవిత్రమైనదని, ఈమాసంలో మహిళలు వేకువజామునే తలంటు స్నానాలు పూర్తిచేసుకొని శివునికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నెలరోజుల పాటు ఆచరించడం ఆనవాయితీ అని ముత్తయిదువు వడగా లక్ష్మణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కార్తీకమాసం ప్రారంభం కావడంతో స్థానిక పట్టుశాలి వీధిలో గల రామమందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీధిలో గల మహిళలంతా రామమందిరం వద్ద ఆకాశదీపాన్ని ప్రారంభించారు. వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి ఈదీపకాంతులు చెందుతాయని భక్తుల విశ్వాసం. సాయంత్రం ఈనెలరోజులు విష్ణు సహస్రనామాలతో పాటు మహిళలంతా ముక్తకంఠంతో కార్తీక పురాణ ప్రవచనాన్ని ప్రారంభించి ఆలపిస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

550 మందికి కిట్లు పంపిణీ
సారవకోట, నవంబర్ 8: మండలంలోని కొమ్ముసరియాపల్లి, వాండ్రాయి పంచాయతీల పరిథిలో గల 550 మంది బాధితులకు క్రయంత్ పాఠశాల యాజమాన్యం కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌లో పదికిలోల బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు సబ్బులు, దుప్పటి పంపిణీ చేశారు. కొమ్ముసరియాపల్లి గ్రామానికి చెందిన రగుతు భానుమూర్తి ప్రేరణతో పాఠశాల యాజమాన్యం తుఫాన్ బాధితులకు ఈ కిట్‌లను అందజేశారు. స్థానిక మాజీ సర్పంచ్ గొర్లె ఢిల్లీరావు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

బ్యాంక్ సేవలు వినియోగించుకొండి
* కెనరా బ్యాంక్ డి. ఎమ్. షష్మాల్
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 8: తమ ఖాతాదారులకు సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ సేవలను ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కెనారాబ్యాంక్ డివిజనల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ షష్మాల్ కోరారు. స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా గురువారం బ్యాంక్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎక్స్‌పో ద్వారా తమ ఖాతాదారులకు కొత్తవారికి హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. మిగతా బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ రేట్లకే తమ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో తమ పదకొండు బ్రాంచ్‌ల ద్వారా పదకొండు కోట్లు రూపాయల మేరకు వివిధ పద్దుల కింద లోన్‌లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం తమ బ్యాంక్ రూ.8లక్షల కోట్ల మేరకు వ్యాపారాన్ని సాధించిందని తెలిపారు. ఈ ఎక్స్‌పోలో పొదుపు, కరెంట్ ఖాతా మేళాను, కాసా క్యాంపెయిన్ పేరిట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో హారికా కన్‌స్ట్రక్షన్స్, విశ్వరూప ఆటోమొటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అజంతా ఆర్కెటెక్, శివశంకర మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, మేంగో హ్యాండాయి కంపెనీలు తమ రియల్ ఎస్టేట్, కార్లను ప్రదర్శించారు. ముందుగా కెనరా బ్యాంక్ ఫౌండర్ సుబ్బారావు పాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ ఎక్స్‌పో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెనరాబ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ జి.అరుణ్‌కుమార్, డే అండ్‌నైట్ జంక్షన్ బ్రాంచ్ మేనేజర్ బి.హరీష్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనురాగనిలయంలో దీపావళి సంబరాలు
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 8: చిన్నారుల కళ్లల్లో కాంతులు వెల్లివిరియాలని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు అన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శాంతాకళ్యాణ్ అనురాగ నిలయంలో బుధవారం దీపావళి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాగ నిలయంలో ఉన్న 54మంది అనాధి పిల్లలకు , ఎనిమిది మంది వృద్ధులకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మన్న భాస్కర్ టపాకాయలు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు పేర్ల నరేష్ విద్యార్థుల విద్యఅవసరాల నిమిత్తం రూ. 25వేలు విరాళంగా ఇచ్చారు. 8,9, 10 తరగతుల విదార్థులకు మగటపల్లి కామేశ్వరరావు, 6,7 తరగతుల విద్యార్థులకు గోవింద్ కొశ్చన్ బ్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్వపు అధ్యక్షులు పేర్ల మహేష్ సరస్వతి పథకం ద్వారా ఇంటర్ చదువుతున్న పిల్లలకు పాఠ్యపుస్తాకాలు, నోట్‌పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ గుప్త, కె.శ్రీనివాస్, కామేశ్, సుధాకర్, రెడ్‌క్రాస్ ప్రతినిథి వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.