శ్రీకాకుళం

పరనిందలకు వేదిక మహానాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 30: టిడిపి అట్టహాసంగా, ఆర్భాటంగా మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి, పరనిందలకు మాత్రమే వేదికగా మారిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి విమర్శించారు. ఈ మేరకు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత టిడిపి మొదటిసారిగా నిర్వహించిన మహానాడులో ప్రజలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశం కరవైందన్నారు.
ప్రజలను మభ్యపెట్టే తీర్మానాలతో సిద్ధాంతాలుగా చెప్పుకుంటున్న టిడిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని మహానాడులో పాతరేసారని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోది మోసాన్ని ఖండించలేని స్థితిలో టిడిపి ఉందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల అధికారంలో అవినీతి పరాకాష్టకు చేరుకొని దోపిడీపార్టీగా టిడిపి మారిందని, అయితే వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించలేని బాబు తనకు తాను సెల్ఫ్ ధ్రువపత్రాల ఇచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. టిడిపి చరిత్రని, తెలుగుజాతి చరిత్రగా చెప్పుకోవడం చంద్రబాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మొత్తంగా టిడిపి మహానాడు పరనిందగా మారిందని విమర్శించారు. సమావేశంలో ముస్తాక్ మహమ్మద్, గంజి ఆర్ ఎజ్రా, సనపల అన్నాజీరావు, ఎం.ఎ.బేగ్ పాల్గొన్నారు.