శ్రీకాకుళం

నేటినుండి చైల్డ్‌లైన్‌సే దోస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 13: బాలల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీనుండి చైల్డ్‌లైన్‌సే దోస్తి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం (వైసిబి) సంచాలకులు ఎమ్.ప్రసాదరావు వెల్లడించారు. ఈవిషయమై మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని బాలలకు వీలయినంత ఎక్కువమందిని స్నేహితులుగా పరిచయం చేయడం కోసం చైల్డ్‌లైన్‌సే దోస్తి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలి భారత ప్రధాని చాచానెహ్రూ జయంతిని పురష్కరించుకొని బాలల దినోత్సవమైన నవంబర్ 14న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీవరకు కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీరోజు ఒక్కో అంశంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. బాలలను రక్షించేందుకు చైల్డ్‌లైన పనిచేస్తుందని, వారిని రక్షించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను అందేలా చేయడం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నెం 1098కి కాల్ వచ్చిన గంట వ్యవథిలో బాలలను రక్షించి బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి వారికి పునరావాసం కల్పించడం లేదా వారి బంధువులకు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తమ సంస్థతో పాటు పోలీస్, మాతా శిశుసంక్షేమం, రెవెన్యూ, కార్మిక, విద్య, వైద్య, ఆరోగ్యం, ఎన్‌సి ఎల్‌పి, డి ఆర్‌డి ఏ, డూమా, న్యాయశాఖల సహాయాన్ని తీసుకొంటున్నట్లు ఆయన వివరించారు. చైల్డ్‌లైన్ సంస్థ ద్వారా గత ఏడాది వరకు 3,360 మంది బాలలకు విముక్తి కల్గించడం జరిగిందని 2018-19 అర్థ సంవత్సరంలో 577 బాలలను రక్షించడం జరిగిందని వివరించారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
పలాస, నవంబర్ 13: పలాస మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు సూచించారు. మంగళవారం 13వ వార్డుకు చెందిన ఐటీ ఐ వద్ద 10 లక్షల రూపాయలతో ఇళ్లు,కాలువ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస మున్సిపాలిటీ అభివృద్ధికి తామెంతో కృషి చేస్తున్నప్పటికి కొంతమంది ఆటంకం సృష్టిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. గుత్తేదారులను భయపెట్టడం సరైన పద్దతి కాదని, నిర్మాణ పనులపై చీటికిమాటికి ఫిర్యాదులు చేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు పక్కాగా చర్యలు తీసుకుంటారని, కొంతమంది వ్యక్తులు అధికారులపై సహితం ఫిర్యాదు చేయడం అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులు, గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారన్నారు. పలాస మున్సిపాలిటీని ఆదర్శమున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని తాను రేయింబవళ్లు కృషి చేస్తుంటే వాటిని అడ్డుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎస్.మోహనరావు, ఎస్.వల్లభ, బల్ల శ్రీనివాసరావు, సవర సుమన్, ఆశ తదితరులు పాల్గొన్నారు.
రైతుబజారుకు సహకరించాలి
పలాస, నవంబర్ 13: పలాసలో రైతుబజారు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 80 వేల జనాభా కలిగిన మున్సిపాలిటికి రైతుబజారు లేకపోవడం దురదృష్టకరమని, రైతుబజారు నిర్మాణం కోసం అధికారులు గుర్తించిన స్థలాన్ని దళితసోదరులు పెద్ద మనస్సుతో అంగీకరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వారి కోరిక మేరకు మీసేవ కేంద్రం వద్ద 9 సెంట్లు స్థలాన్ని ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు అంగీకారం తెలుపుతూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారన్నారు. దళితులంతా ఇందుకు అంగీకరిస్తే భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎహెచ్‌పి ఇళ్లుకు శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఇంగిలిగాం వద్దకు రానున్నారని, సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. 50 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజి యజమాన్యాలు, ప్రభుత్వం సంయుక్తంగా కిడ్నీ పరిశోధన కేంద్రం పలాసలో ఏర్పాటు చేస్తుందని, ఇందుకు గాను సీ ఎం ఇటీవల శంకుస్థాపన చేసారని, ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారన్నారు. కిడ్నీ రోగులు కోసం ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి సంసిద్దత తెలియజేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఎమ్మెల్యే శివాజీకి ప్రత్యేక దన్యవాదాలు అని అన్నారు. ఈ సమావేశంలో పలాస ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జి.సూర్యనారాయణ, టీడీపీ నాయకులు లోడగల కామేశ్వరరావు, బడ్డ నాగారాజు, పుట్టా లోకనాధం తదితరులు పాల్గొన్నారు.