శ్రీకాకుళం

ప్రోజెక్ట్‌లను త్వరిత గతిన పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 13: జిల్లాలో భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రహదారులు, జలవనరుల ప్రాజెక్ట్‌లు భూసేకరణపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జాతీయ రహదారుల భూసేకరణలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూసేకరణకు సంబంధించిన మొత్తాలను తక్షణం చెల్లింపు చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూసేకరణ చేసిన స్థలాల్లో ఆక్రమణలు ఉంటే వాటిని తక్షణం తొలిగించి రహదారుల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో చెట్ల విలువ లెక్కింపు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆర్ అండ్‌బి శాఖ కింద జరుగుతున్న వనిత మండలం, కొమనాపల్లి బ్రిడ్జిలకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవోను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే పాస్ చేయడం జరిగిందని, పనులను చేపట్టాలని అన్నారు. భూసేకరణ కొత్త చట్టం ప్రకారం చేపట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వంశధార హైలెవెల్ కెనాల్‌కు 25 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని, నవంబర్ 30 నాటికి అవార్డు పాస్ కావాలని ఆయన ఆదేశించారు. మహేంద్రతనయ ప్రాజెక్ట్ 165 ఎకరాలు భూసేకరణ చేయాలని ఆయన అన్నారు. వీటిని త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీనుండి పునరావాస కాలనీలకు సంబంధిత గ్రామాలు తరలివెళ్లాలని ఆయన కోరారు. పునరావాస కాలనీలో తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర వౌళిక వసతులు కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వంశధార 87వ ప్యాకేజీ పనులు మందకొడిగా సాగుతున్నాయని, కాంట్రాక్ట్‌పై చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ఆదేశించారు. రూ.14లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగాల్సిన అవసరం వుందని, వందరోజుల సమయం ఇస్తున్నామని, డిసెంబర్ 8వరకు పరిశీలించి కాంట్రాక్ట్‌లపై చర్యలు చేపడతామని వంశధార పర్యవేక్షక ఇంజనీర్ ఎం. సురేంద్రరెడ్డి జిల్లా కలెక్టర్‌కు వివరించగా అవసరమైతే బ్యాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు వెనకాడరని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తికాకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుందని, లక్షలాది మంది దీపిపై ఆధారపడి వుండగా జాప్యం జరగడం మంచిది కాదని ఆయన అన్నారు. ప్రజలు ఎందుకు సమస్యలు ఎదుర్కోవాలిన ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్ట్ పునరావాస కాలనీలో వౌళిక వసతులు కల్పన జాప్యం జరగరాదని కలెక్టర్ ఆదేశించారు. ఆలయాల నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆ పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. గృహనిర్మాణాలు త్వరితగతిన జరగాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ క లెక్టర్ కెవి ఎన్ చక్రదరబాబు, ఆర్డీవో ఎమ్.వి రమణ, సర్వే శాఖ ఏడి డిబిడిబి కుమార్, డిప్యూటీ కలెక్టర్‌లు బి.శాంతి, కె.్ధర్మారావు, అప్పారావు, హెచ్.వరప్రసాద్, రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్లు కె.కాంతిమతి, అటవీశాఖ రేంజ్ అథికారి గోపాలనాయుడు, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ పి.రవి, జలవనరుల శాఖ ఇంజనీర్లు రామచంద్రరావు, పి.రంగారావు, విద్యవౌళిక వసతుల సంస్థ ఎస్‌ఈ కె.్భస్కరరావు, ఈపిడిసి ఎల్ డీ ఈ జి. ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తిచేయాలి
* కలెక్టర్ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, నవంబర్ 13: జిల్లాలో ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ సమావేశం మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఆదిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో సిమెంట్ రహదారులు రోజుకు సరాసరి 25కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సి వుందని పేర్కొన్నారు. ఆమేరకు త్వరితగతిన పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామపంచాయతీ భవనాలను కూడా కచ్చితంగా పూర్తిచేయాల్సివున్నందును వాటిని కూడా పూర్తిచేసేలా చూడాలన్నారు. జిల్లాలో సిసి రోడ్లు కేవలం 233 కిలోమీటర్లు మాత్రమే వేశారని, నిర్ధేశించిన లక్ష్యంలో 36శాతమే ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. సమావేశంలో జేసి కెవి ఎన్ చక్రధరబాబు, పర్యవేక్షక ఇంజనీరింగ్ కెఎమ్‌వి ప్రసాదరావు, ఎస్‌ఈలు రాధారాణి, బుద్ద ప్రసాద్, జి ఎస్ ఆర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

దర్జాగా దేవుడి భూములు కబ్జా
* పెత్తందార్లకు ముడుపులు * కొనుగోలుదారులకు రియల్ ఎస్టేట్ పంట
పొందూరు, నవంబర్ 13: ఆధ్యాత్మిక భక్తి భావాలతో పూర్వికులు గ్రామాలలో దేవాలయాలు కట్టి ఆయా దేవాలయాలకు దూపదీప నైవేద్యాల కోసం కొంత భూములను ఆయా దేవాలయాలకు గిప్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అలనాటి దాతలు ఇచ్చిన భూములు నేడు సాక్షాత్తు భగవంతునికే శఠగోపం పెట్టి ధన సంపాదన కోసం దూతలుగా మారారు. అడిగే నాధుడు లేడుకదా? దేవుడేం చేస్తాడు..పైసలు చూపిస్తే గ్రామంలో ఉండే మాటకారి పెత్తందార్లును మూగవాడిని చేసి దర్జాగా దేవుడిభూమలు కబ్జా చేసే కబ్జాకోరులు శాతం విపరీతంగా పెరిగిపోయింది. కాసులిస్తే చాలు దేవుడి భూములు సైతం దర్జాగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆమ్మకాలు, కొనుగోలు సాగిపోతున్నాయి. ఇదేం దారుణమని అడిగితే 1బి తెచ్చుకుంటే చాలు కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చని ఖరాకండిగా చెబుతున్నారు. అధికారులు తప్పిదాలే దేవుడి భూములు దగుల్బాజీల పాలవుతుందని ఆధ్యాత్మిక వేత్తలు గుసగుసలాడుతున్నారు. పురాతన కాలంలో పొందూరు గ్రామానికి చెందిన కలగర్ల శంకరమహదేవి శెట్టితో పాటు మహేంద్ర రామప్పడు భక్తుడు సుగ్గుగురునాయుడు అనే దాతలు స్థానిక కోదండరామస్వామి, రామలింగేశ్వర స్వామి, సోమలింగేశ్వర, మల్లిఖార్జున, శాలిహుండాం వేణుగోపాలస్వామి, తాడివలస వంటి మందిరాలకు, పొందూరు కలగర్ల శంకర మహదేవి శెట్టి చౌల్ట్రీలకు దాతలుగా నిలిచి సుమారు 1600 ఎకరాల భూమిని దీపధూప నైవేధ్యాల నిమిత్తం అందిస్తే కాలక్రమేపి నాయుడు, కరణాల కాలం నుండి అన్యాక్రాంతం చేసిన బడాబాబులు పాస్‌పుస్తకాలు సంపాదించుకొని ఊరికనే వచ్చిన భూములను ఎంతోకొంతకు అమ్మడం ప్రారంభించారు. నాయుడు, కరణాల పాలన తర్వాత పంచాయతీ కార్యదర్శులు వచ్చినా దోపిడి తీరు మారలేదు సరికదా అఫీషియల్‌గా రికార్డులు మార్చి గోప్యంగా రెట్టింపు దోపిడీలు పెరిగిందని పెద్దలనుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. నేడు వీ ఆర్వో, వి ఆర్ ఏ పాలన సైతం రికార్డులు ఎలావుంటే అదే చెబుతామంటూ చెప్పుకొస్తున్నారు. మాటకారి పెద్దమనుషులు పూర్వకాలంలో నాయుడు,కరణాలకు తులమో, పణమో చేతిలో పెట్టి రికార్డులు మార్చుకోవడం చేతనే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని రైతుల నుండి వినిపిస్తొంది. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా బాధ్యతగల ఎండోమెంట్ అధికారులు కల్లప్పగించి చూస్తున్నారే తప్ప ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంటోమెంట్‌కు పూర్తిగా ఏలినాటిశని పట్టిందని స్పష్టంగా కన్పిస్తుంది. ఫిర్యాదులు మేరకు ఎండోమెంట్ అధికారులు చుట్టం చూపుకు వచ్చి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎండోమెంట్ అధికారులకు దేవుడి భూములు ఎక్కడున్నాయో వారికే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్లకొక ఈవోను నియమించి ట్రాన్ఫర్ చేయడంతో పూర్తిగా భూపరిశీలన చేయలేకపోతున్నారని తెల్సింది. మూడేళ్ల కాలంలో గ్రామ పెంతందార్లతోమాకెందుకులే అన్నట్లుగా అధికారులు వ్యవహారిస్తున్నారు. దేవుడు భూములు మండలంలో మల్లేసుపేట, తండ్యాం, బొట్లపేట, లచ్చింపేట, పొందూరు, రాపాక, గారపేట, కుంచాడ, తాడివలసలతో పాటు జి.సిగడాం మండలంలోని వాండ్రంగి, ఆనందపురం అగ్రహారంలో దేవుని భూములు సాగుచేస్తున్నారు. సుమారు పదేళ్ల క్రితం కొంతమంది రైతుల నుండి భూమిశిస్తు వసూలు చేసేవారని క్రమేపి శిస్తులు వసూల్లు చేసేందుకు అధికారులు రావడం లేదంటూ రైతులు చెబుతున్నారు. 50 ఏళ్లగా సోమలింగేశ్వర స్వామి భూములకు శిస్తు కట్టే రైతులను తొలగించి అర్చక భూములని రైతులను తొలగించారని సాగురైతులు చెబుతున్నారు. కోట్ల విలువైన భూములు దేవుళ్లకు ఉండగా అర్చకులుకు మాత్రం భక్తులు వేసే చిల్లర పైసాలతో దేవుళ్లుకు బోగాలు, దీపధూప నైవేద్యాలు పెట్టగా ఆయా దేవాలయ అర్చకులకు మాత్రం పస్తులు తప్పడం లేదు. అలనాటి దేవుని భూములను రియల్ ఎస్టేట్‌లుగా మార్చి కోట్లకు పగడెత్తుతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఆధ్యాత్మిక వేత్తలు విసవిసలాడుతున్నారు. ధనవంతుల ముసుగులో దేవుని భూములు కాజేసి రియల్ ఎస్టేట్‌లుగా చలామణి అవుతున్నారు. ఎండోమెంట్ అధికారులు డేగకన్ను వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏడాది కాలంగా శాలిహుండం దేవస్థాన ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ సుగ్గుమధురెడ్డి అన్యాక్రాంతమైన భూములను పరిశీలిస్తున్నారు. కబ్బాదారులకు నోటీసులు జారీ చేశారు. ఎండోమెంట్ సర్వే బృందం పరిశీలన చేస్తుండగా మళ్లీ లక్ష్యుంపేట గ్రామ సమీపంలో మూడెకరాల దేవుని భూములను దర్జాగా కబ్జాచేసి రియల్ ఎస్టేట్‌లుగా మార్పుచేశారు. విచ్ఛలవిడిగా కబ్జా చేస్తున్న కబ్జాదారుల సంఖ్య పెరిగిపోతుందని అధ్యాత్మిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.