శ్రీకాకుళం

పరిసరాల పరిశుభ్రత పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, నవంబర్ 15: గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని మండల విద్యాశాఖాధికారి బాలరాజు అన్నారు. గురువారం మండలంలోని చిన్నకాగితాపల్లి గ్రామ పంచాయతీలో ఆయన వివిధ శాఖల అధికారులతో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీలోని బుడ్డివలస, వీరభద్రాపురం, ఎల్.కె.పల్లి, శాస్త్రులపేట, చినకాగితాపల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ పథకాల పనితీరు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చినకాగితాపల్లి పాఠశాల వద్ద గ్రామసభ నిర్వహించి వివిధ శాఖలకు చెందిన నివేదికలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎం ఈవో బాలరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, దీనిపై ప్రజలు పూర్తి సహకారం అందించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ దామోదరరావు, ఏపీ ఎం కమలకుమారి, ఏపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించిన జే ఆర్‌సీ
సరుబుజ్జిలి, నవంబర్ 15: మండలంలోని రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్(జే ఆర్‌సీ) జిల్లా క్షేత్ర పరిశీలకులు గంటా విజయబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉన్న వౌళిక వసతులు, పరిశుభ్రత, పచ్చదనం, పాఠశాల ఆవాస ప్రాంతాలు, పాఠశాలలో అమలు జరుగుతున్న వివిధ సామాజిక అంశాల గూర్చి పాఠశాల జేసీ ఆర్ నోడల్ ఇన్‌చార్జి మందపల్లి రామకృష్ణారావును అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపనున్నట్టు తెలియజేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
రాజాం, నవంబర్ 15: రాజాం నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతూ గురువారం రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి కళా వెంకటరావు కార్యాలయంలో బాధితులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే కంబాల జోగులు క్యాంప్ కార్యాలయంలో కూడా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు ఎం.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తామని కాలయాపన చేస్తుందని విమర్శించారు. మాట నిలుపుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్దిచెబుతామన్నారు. ఏ ఐటియూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిబాబు, గోపాలకృష్ణ, జె.వి.రమణ, మీసాల సూర్యనారాయణతో పాటు నీలకంఠేశ్వరయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మాతృభాషను మృతభాషగా మార్చకండి
రాజాం, నవంబర్ 15: తెలుగు మాతృభాషను మృతభాషగా మార్చవద్దని రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాధం కోరారు. గురువారం విద్యాకళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత కొంతకాలం వరకు హిందీ, బెంగాళీ తర్వాత తెలుగుభాష మాట్లాడిన వారు అత్యధికంగా ఉన్నారని, దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలుగుభాష ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నాలుగో స్థానానికి దిగిందన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు, తల్లిదండ్రులు సమాజంలోని అన్ని వర్గాల వారు తెలుగుభాషపై మమకారం పెంచుకోని రక్షించుకోవాలన్నారు. ఆయనతో పాటు రమణమూర్తి, పెంకి చైతన్య, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
రాజాంలో భారీ అన్నదానం
రాజాం, నవంబర్ 15: రాజాంలోని నవదుర్గ ఆలయం పాలకవర్గం ఆధ్వర్యంలో సూర్యకళ్యాణ మండపం ఆవరణలో గురువారం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.