శ్రీకాకుళం

జెండాలు కాదు.. ప్రత్యేక హోదా ఎజెండా కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 15: రాష్ట్రంలోని పార్టీలన్నీ తమ జెండాలను పక్కన పెట్టి ప్రత్యేక హోదాయే ఎజెండాగా ముందుకు సాగాలని విప్లవ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక ఆనందమయి కనె్వన్షన్ హాల్‌లోగురువారం నిర్వహించిన పత్రికాసమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఆదిబట్ల, వెంపటాపు సత్యం మాస్టర్ల సాయుధ పోరాటానికి వీరగున్నమ్మ వీరత్వానికి మారుపేరుగా చరిత్రలో నిలిచిందన్నారు. అటువంటి గడ్డపై ప్రత్యేకాంధ్ర హోదా కోసం, రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీల సాధన కోసం ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో గురువారం సమరయాత్ర ప్రారంభించడం ఎంతైనా గర్వించదగ్గ విషయమన్నారు. ఉద్యమ పోరాటాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని, అందరూ కలిసి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా తప్పగా లభిస్తుందన్నారు. విద్యార్థులారా గొంతెత్తండి..బలిదానాలు వద్దని ఆయన కోరారు. యువజనులకు ఉన్న ఓటు బాంబులు, తుపాకులు కంటె ఎంతో బలమైనదని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని అన్యాయం చేసిన బీజేపీని మీ ఓటుతో తరిమికొట్టండన్నారు. ప్రత్యేక హోదా కల్పించండని ప్రశ్నించిన వారు మోదీకి శత్రువుగా మారారని, తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ మాట తప్పారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్రానికి దాసోహం అన్న చంద్రబాబు నిలదీసిన విద్యార్థులపై కేసులు బనాయించారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆకేసులను ఎత్తివేయాలన్నారు. సమైఖ్యాంధ్ర కోసం ప్రత్యేక హోదా కోసం ఎప్పటినుండో అలుపెరుగని పోరాటం చేస్తున్న చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ పోరాటాలు పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచి మరో ఉద్యమం నేడు ప్రారంభమయిందన్నారు. తూర్పు నుంచి ప్రారంభమయిన ఈ పోరాటం ఎట్టిపరిస్థితుల్లోను ఆగదని, ప్రత్యేక హోదా వచ్చేవరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు. రాబోయే తరాల భవిష్యత్‌కోసమైనా మనం పోరాడాల్సిన అవసరం తప్పదన్నారు. మనకు అన్యాయం చేసిన నేతలు ఢిల్లీ గడ్డ ఎక్కకుండా చూడాలన్నారు. జల్లికట్టు సాంప్రదాయ క్రీడకు మద్దతిచ్చిన సినీస్టార్‌లు ప్రత్యేక హోదాపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ ఉద్యమాలతో దేశద్రోహులు అనే ముద్రవేస్తే సిద్ధంగా ఉన్నామని, కేసులకు భయపడమన్నారు. ఇది పదమూడున్నర కోట్ల ప్రజల ఆత్మ ఘోష అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర యూనివర్శిటీ విశ్రాంతి ప్రొఫెసర్ అప్పలనాయుడు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ ప్రొఫెసర్ సదాశివ రెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్ జార్జి విక్టర్, విద్యార్థి సంఘాల నాయకులు లెనిన్ బాబు, సూర్యారావు, రమణ, సుబ్బారావు, రవికిరణ్, డాక్టర్ సతీష్, జి.నర్సునాయుడు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.