శ్రీకాకుళం

బయో కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 30: డి.మత్స్యలేశం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన బయో కెమికల్ ఫ్యాక్టరీ వలన పరిసర గ్రామాల జలవనరులు కలుషితమవుతున్నందున తక్షణమే ఆ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం, రాళ్లుపేట, ఎస్.డి.పాలెం, కె.డి.పాలెం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మత్స్యకార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమం అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. హేచరీ వలన చుట్టుపక్కల ఉన్న చెరువులు, గుంటలు కనుమరుగైపోయాయన్నారు. హేచరీ విడిచిపెడుతున్న కాలుష్యంతో సముద్ర సంపద లేక ఇక్కడి మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా హేచరీ నడవడం వలన భూగర్భ జలాలు విషపూరితమై కనీసం తాగడానికి చుక్కనీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పైగా జలకాలుష్యంతో విషజ్వరాలు, డయేరియా, రక్తవిరేచనాలు, వాంతులు, మూత్రపిండాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలుష్యమైన నీటిని తాగడం వలన గొర్రెలు, ఆవులు మృతిచెందాయని గుర్తుచేశారు. ఉన్నతాధికారులు స్పందించి హేచరీ పరిసరాలను పరిశీలించి తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మూగి రామారావు, మత్స్యకార నేతలు కె.లక్ష్మణరావు, కె.పోలిరాజు, పి.అమ్ములు పాల్గొన్నారు.